కమాన్ పూర్ మండలంలో పులి సంచారం…

-భయం గుప్పిట్లో ప్రజలు..

Date:16/09/2020

కమాన్ పూర్ ముచ్చట్లు:

గత వారం రోజులుగా పులి కమాన్పూర్ మండల పరిసర ప్రాంతాల్లో తిరగడంతో ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. గత పది రోజుల క్రితం ముత్తారం మండలం బహుళ గుట్టల్లో ఆవుల పై దాడి చేయగా ఒక ఆవు చనిపోయింది.అదే పులి ముత్తారం రామగిరి కమాన్పూర్ మండల పరిసర ప్రాంతాల్లో తిరగడంతో ఆయా మండలాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం కమాన్ పూర్ మండలం లోని గుండారం గ్రామ పంచాయతీ పరిధిలోని రాజేంద్రనగర్లో పులి తిరిగిన ఆనవాళ్లు దాని కాళీ ముద్రలు కనిపించడంతో సర్పంచ్ ఆకుల బోదెలు సెక్షన్అధికారి అమీర్ రొద్దిన్ మరియు యు.ఎస్ ఐ శ్యామ్ పటేల్లకు సమాచారం ఇచ్చాడు. దీంతో రాజేంద్ర నగర్ కు వెళ్లి దాన్ని పాదముద్రలను సేకరించారు. అదే దారి గుండా మళ్ళీ రొంపి కుంటలో దాని పాదముద్రలు ప్రత్యక్షమయ్యాయి. అక్కడి సర్పంచ్ రవీందర్ అటవీశాఖ అధికారులు సమా చారం ఇచ్చారు. దీంతో కమాన్పూర్ మండల పరిసర ప్రాంతాల్లో పులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శాం పటేల్  సర్పంచులు ఆకుల ఓదెలు కటకం రవీందర్ లు ప్రజలను కోరుతున్నారు. అలాగే గోదావరిఖని ఏసీపీ   పోలీస్ స్టేషన్లు గోదావరిఖని టు టౌన్ సిఐ శ్రీనివాసరావు ఎస్ ఐ శ్యామ్ పటేల్ తో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

 కరోనా విరామం అనంతరం మెట్రో పరుగులు

Tags: Tiger roaming in the Kamanpur Zone …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *