పులి సంచారం…. భయాందోళన లో  ప్రజలు..

Date:15/08/2020

అదిలాబాద్  ముచ్చట్లు:

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం లో మళ్లీ పులి సమాచారం కలకలం రేపింది. భీంపూర్ మండలం లోని కరంజి టీ ప్రాంత అడవులలో పెద్దపులి దాడిలో ఒక ఆవు దూడ మృతి చెందింది. కరన్ వాడి గ్రామానికి చెందిన సొంజీ తన పశువులను  అడవికి మేతకు తీసుకెళ్ళాడు అయితే మధ్యలో ఒక  ఆవు దూడ కనిపించని విషయం తెలుసుకొని అడవిలోగాలించారు. మృత్యువాత పడ్డ ఆవు దూడ చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఆ ప్రాంతాన్ని ఎఫ్ఎస్ఓ గులాబ్, ఎఫ్ బీ ఓ కేశవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి పులి చంపినట్లు నిర్ధారించారు.

ఎర్రకోట వద్ద జాతీయజెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Tags: Tiger wandering …. People in panic ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *