బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

తిరుమల ముచ్చట్లు:


శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఎత్తున్న భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ తెలిపారు.భక్తుల భద్రత దృష్ట్యా 5 వేల మంది పోలీసులతో బ్రహ్మోత్సవాలకు భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. మాడ వీధుల్లోకీ భక్తులు సులభతరంగా వచ్చే విధంగా క్యూ లైన్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హారతి సమయంలో అదనంగా భక్తులు స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఘాట్ రోడ్డులలో ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వెల్లడించారు.గరుడసేవ నాడు భక్తులు ఓపికగా నిరీక్షించి స్వామి వారిని దర్శించుకోవాలని తెలిపారు. 12 వేల వాహనాలు దాటిన తరువాత తిరుమలకు కార్లను అనుమతించమని స్పష్టం చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన పార్కింగ్ కేంద్రాల్లో వాహనాలను పార్క్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 30న మధ్యాహ్నం నుంచి ద్విచక్ర వాహనాలను తిరుమలకు అనుమతించమని టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ తెలిపారు.

 

Tags: Tight security arrangements for Brahmotsavam

Leave A Reply

Your email address will not be published.