Natyam ad

పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక వ్రాత పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు-జిల్లా ఎస్పీ .వి. హర్షవర్ధన్ రాజు

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

జిల్లా వ్యాప్తంగా మదనపల్లి లో 20 మరియు రాజంపేట లో 10 పరీక్షా కేంద్రాల లో మొత్తం 13,684 మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వ్రాత పరీక్ష.రాయచోటి జనవరి 20 : అన్నమయ్య జిల్లాలో ఈనెల 22 వ తేదీ ఆదివారం జరుగనున్న కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక వ్రాత పరీక్షల నేపథ్యంలో తీసుకున్న భద్రతా చర్యలు, నియమ నిబందనల పై అన్నమయ్య జిల్లా ఎస్పీ  .వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్., శుక్రవారం ప్రత్యేక పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 పరీక్షా కేంద్రాలలో 13,684 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు.

Post Midle

అభ్యర్ధులకు సూచనలు:
✳️ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షల కు హాజరు అయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటల నుండి పరీక్షా హాల్ లోకి అనుమతించడం జరుగుతుంది.
✳️ ఉదయం 10 గంటల వరకు పరీక్షా కేంద్రం యొక్క మెయిన్ గేటు లోకి అనుమతిచబడును.
✳️ 10 గంటల తరువాత ఒక్క నిముషం ఆలశ్యం అయిన, పరీక్షా కేంద్రం యొక్క మెయిన్ గేటు లోకి అనుమతించబడరు.
✳️ అందు వలన అభ్యర్దులందరు ఉదయం 08.30 నుండి 09.00 లోపల పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
✳️ పరీక్ష వ్రాసేందుకు వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష హాల్లోకి అనుమతించడం జరుగుతుంది.
✳️ అభ్యర్ధులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్ లు, బ్లూ టూత్ పరికరాలు, వాచ్ లు పరీక్షా గదిలోకి తీసుకొని పోవడానికి అనుమతిలేదు.
✳️ అందువలన, అభ్యర్ధులందరికీ సూచనా ఏమనగా, ఎవ్వరు కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్ లు, బ్లూ టూత్ పరికరాలు, వాచ్ లు తమ వెంట తీసుకొని రావద్దు. ఎవ్వరైనా తీసుకొని వచ్చినా, మీరు పరీక్షా కేంద్రం లోకి వెళ్ళేటప్పుడు మీ యొక్క బంధువులకు, స్నేహితులకు తెలిసినవారికి ఇచ్చి పరీక్షా కేంద్రం లోకి వెళ్ళడం మంచిది.
✳️ దూర ప్రాంతాల నుండి వచ్చి భంధువులు, స్నేహితులు ఎవ్వరు లేని పక్షం లో, పరీక్షా కేంద్రాల వద్ద వున్న బ్యాగేజ్ కౌంటర్ల ను ఉపయోగించుకోవాలి.
✳️ ఫై విదంగా మీ యొక్క బ్యాగేజ్ ని లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్ లు, బ్లూ టూత్ పరికరాలు, వాచ్ లను బ్యాగేజ్ కౌంటర్లలో పెట్టాలి, అని అనుకుంటే పరీక్షా కేంద్రానికి 08.30 గంటలకు వచ్చి మీ బ్యాగేజ్ ని కౌంటర్ లో అప్పగించాలి.
✳️ రాజంపేట నందు గల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, అన్నమయ్య ఇంజనీరింగ్ కాలేజీ , మదనపల్లి టౌన్ లో MITS కాలేజీ, ఆదిత్య కాలేజీ, కృష్ణ రెడ్డి ఫార్మసీ కాలేజీ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ పరీక్షా కేంద్రాలు మైయిన్ రోడ్ కు దూరంగా ఉండటం వలన అభ్యర్థులు నిర్ధారించిన సమయానికంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు రావలసి వుంటుంది.
✳️ అభ్యర్థులు తమ హాల్ టికెట్లతో పాటు ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు మరియు బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్నులు మాత్రమే తీసుకురావాలని జిల్లా ఎస్.పి గారు సూచించారు.

చట్టపరమయిన చర్యలు:
🚔🚨 అభ్యర్థులు ఎవరు కూడా అవకతవకలకు పాల్పడినా క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి, వారు భవిష్యత్తులో ఎటువంటి ఉద్యోగాలకు కూడా అనర్హులవుతారు.
🚔🚨 పరీక్షా కేంద్ర ల వద్ద, డ్యూటీ లో వున్న వారు మరియు అభ్యర్థుల కు మాత్రేమే అనుమతించబడును. ఇతరులు ఎవ్వరైనా పరీక్ష కేంద్రం లో కానీ, పరీక్ష కేంద్ర ల వద్ద కనిపించిన చట్ట పరమయిన చర్యలు తీసు కొబడును.
🚔🚨 కాపీయింగ్ లేదా మాల్ ప్రాక్టీస్ కు పాల్పడి పట్టు బడితే తదుపరి పోలీస్ నియామకాల్లో ప్రవేశం జీవితాంతం కోల్పోవడమే కాకుండా వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడుతుంది.
🚔🚨 ఎటువంటి మోసాలకు తావులేదని, ఎవ్వరిని నమ్మవద్దని, ఎవరైనా మీకు ఉద్యోగం ఇప్పిస్తామని కానీ, పరిక్షలలో సహాయం చేస్తామని మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకుని ఉంటే వెంటనే డయల్ 100 ద్వారా మాకు ఫిర్యాదు చేస్తే వారి పైన కఠిన చర్యలు తీసుకొబడును.
🚔🚨 జిల్లాలో ఉన్న అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సి.ఆర్.పి.సి. అమలులో ఉంటున్నందున, ఎవ్వరూ గుంపులుగా ఉండకూడదన్నారు.
🚔🚨 పరీక్షా కేంద్రాలకు దగ్గరలో గల జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్ లు అన్ని మూసి వేయడం జరుగుతుంది.
🚔🚨 పరీక్షా కేంద్రాల వద్ద డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో నిరంతరం తనిఖిలు చేయడం జరుగుతుందని మరియు మొబైల్ పార్టీ లు, ఫ్లైయింగ్ స్క్వాడ్ లు తిరుగుతూ వుంటాయి.

హెల్ప్ డెస్క్:
🫱 రాజంపేట లో పాత మరియు కొత్త బస్స్టాండ్, రైల్వే స్టేషన్ లోను, మదనపల్లి చిత్తూర్ బస్టాండ్, బెంగళూర్ బస్టాండ్, ఆర్.టి.సి. బస్టాండ్ ప్రాంతాలలో అభ్యర్థుల సౌలభ్యం కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది.
🫱 ఈ హెల్ప్ డెస్క్ లో ఉన్న పోలీస్ సిబ్బంది, అభ్యర్థుల కు పరీక్ష కేంద్రాల గురించి సమాచారము మరియు పరీక్ష కేంద్రాలకు ఏ విధంగా చేరుకోవాలి.. అనే విషయాల ఫై అభ్యర్ధులకు సహకారం అందిస్తారు.
🫱 ఈ పరీక్షల కొరకు మదనపల్లి, రాజంపేట ల లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కంట్రోల్ రూమ్ లో నిరంతరం పర్యవేక్షిస్తారు.
🫱 అదే విధంగా జిల్లా పోలీస్ కార్యాలయం లో కూడా సి.ఐ. గారి ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది.

పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష, రిక్రూట్మెంట్ అంత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో జరుగుతుందని, ఫిజికల్ మరియు వ్రాత పరిక్షలలో ఉత్తీర్ణత అయితేనే ఉద్యోగాలు వస్తాయని అభ్యర్థులు గుర్తుంచుకోవాలని జిల్లా ఎస్.పి వి.హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్ సూచించారు.

 

Tags: Tight Security Arrangements for Preliminary Written Test of Police Constable Jobs-Zilla SP .V. King Harshvardhan

Post Midle