Natyam ad

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రత-జిల్లా ఎస్పీ  పి.పరమేశ్వర రెడ్డి, ఐ,పి.యస్.

నాలుగు వేల మందితో బద్రత, గరుడ సేవ రోజున మరో రెండు వేల మంది.

భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి అసౌకర్యం కలగ కుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.

27న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించునున్న సీ.ఎం .

Post Midle

అనుమానిత వ్యక్తుల పై నిఘా.

భక్తులు, దళారులు పరిచిత వ్యక్తులతో పరిచయం పెంచుకోవద్దు.

భక్తుల సౌకర్యార్థం కొరకు 14 పోలీస్ సబ్ కంట్రోల్ రూం లు ఏర్పాటు.

మీ విలువైన వస్తువులను అవసరమైనవి తప్ప మీతో తీసుకురావద్దు.

ఏ విధమైన అసత్య ప్రచారాలను నమ్మవద్దు.

తిరుమలలో నిరంతరం సీసీ కెమెరాలతో నిఘా.

గరుడ సేవ రోజు తిరుమలకు ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు. 30వ తేది మధ్యాహ్నం 12 గంటల నుండి అనుమతించబడదు.

తిరుమలలో 38 పార్కింగ్ స్థలాలను గుర్తించి సుమారు 8000 వాహనాలు ను పార్కింగ్ చేయుటకు వీలుగా ఏర్పాటు.

టూరిస్ట్ బస్సులు మరియు తిరుమలకు అనుమతి నిరాకరించిన (సీటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్న టెంపో ట్రావెల్) వాహనాలకు జూ పార్ట్ రోడ్ నందు గల దేవలోక్ పార్కింగ్ ప్రాంతాన్ని ఉపయోగించుకోవాలి.

గరుడ సేవ రోజు ద్విచక్ర వాహనాలకు అలిపిరి బట్ స్టాండ్ పాత చెక్ పెయింట్ ఇస్కాన్ గ్రౌండ్, మెడికల్ కాలేజి గ్రౌండ్, నెహ్రు మున్సిపల్ గ్రౌండ్  ఈ ప్రాంతాలు పార్కింగ్ కొసం ఉపయోగించుకోవాలి.

 

తిరుపతి  ముచ్చట్లు:

తిరుమల శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా  ఎస్పీ  పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్  తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా యస్.పి గారు మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల అనంతరం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న నేపధ్యంలో శ్రీవారి వాహన సేవలు నాలుగు మాడ వీధుల్లో నిర్వహిస్తున్నారన్నారు. ఈ వేడుకను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు విచేసే అవకాశం ఉన్నందున దానికి తగినట్లుగా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.   అదేవిధంగా టీటీడీ అనుబంధ ఆలయాల వద్ద కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. దొంగతనాలు అరికట్టేందుకు ముందస్తు భాగంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో, ప్రధాన కూడలి వద్ద దొంగల ఫోటోలను ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తామన్నారు.  నిరంతరం అనుమానిత వ్యక్తుల పై నిఘా ఉంచి తమ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తారన్నారు.

 

సీ.ఎం  పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత

 

ఎన్నో సంవత్సరాలుగా శ్రీవారికి సీఎం గారు పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ అని అదే విధంగా ఈ నెల 27న సీ.ఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి  స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా తిరుపతికి విచ్చేయనున్న సీ.ఎం గారికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఆయన ప్రయాణించే మార్గంలో ఎలాంటి అవకతవకలు చోటు కాకుండా భద్రత చేపట్టామన్నారు. తిరుమల తిరుపతిలో పలు ప్రారంభోత్సవాలలో సీ.ఎం గారు పాల్గొంటారన్నారు. సుమారు సీ.ఎం గారి పర్యటన కొరకు 1,500 మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేపట్టామన్నారు.

 

అన్ని శాఖల సమన్వయంతో

 

తిరుమల లోని అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పోలీస్ శాఖ పని చేస్తుందన్నారు. ఎవరితో ఎలాంటి మనస్పర్థలు లేకుండా సిబ్బంది పని చేసి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు.

 

నిరంతరం తనిఖీలు

 

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు రెండు ఘాట్ రోడ్లు తిరుమల ప్రాంతాలన్నీ కూడా పోలీసులు జల్లెడ పడతారన్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఘాట్ రోడ్లు తిరుమల ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు చేస్తాయన్నారు. ఈ తనిఖీలు నిరంతరం బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు జరుగుతాయన్నారు. ఆక్టోపస్ సిబ్బంది కూడా తిరుమలలో ప్రత్యేక నిఘా తో పని చేస్తారు. అనుమానిత వ్యక్తుల కదలికలు కనపడిన వెంటనే అదుపులోకి తీసుకొని విచారిస్తామన్నారు.

 

తొక్కిసలాటలో జరక్కుండా జాగ్రత్తలు

 

తిరుమల లోని నాలుగు మాడవీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు గ్యాలరీలో చేరుకున్న భక్తులు తొక్కిసలాట లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టామన్నారు. ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్లు వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. గరుడ సేవ రోజున టిటిడి నిర్ధేశించిన సమయానికి భక్తులను గ్యాలరీ లోకి అనుమతిస్తామన్నారు. తిరుమల మొత్తం సీసీ కెమెరాలతో మరియు పోలీసుల ఆధీనంలో ఉంటుందన్నారు. తమ సిబ్బంది కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తారన్నారు. ఎక్కడైనా రద్దీ పెరిగినా కూడా ఆ ప్రాంతాలను అప్పటికప్పుడే గుర్తించి తగు చర్యలు చేపడతామన్నారు.

 

కట్టుదిట్టంగా పార్కింగ్ ఏర్పాట్లు

 

తిరుమలలో వాహనాల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టామన్నారు. తిరుమలలో వాహనాల సంఖ్య పెరిగినప్పుడు తిరుపతిలోని అలిపిరి, బాలాజీ లింక్ బస్ స్టాండ్, దేవలోక, భారతీయ విద్యా భవన్, స్విమ్స్ గ్రౌండ్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.

 

నగర పరిసరాల్లో చెక్ పోస్ట్ లు

 

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు నగర ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. తిరుపతికి చుట్టు పక్కల నుంచి వాహనాలు వస్తాయో గుర్తించి అన్ని ప్రాంతాలలో చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతాలలో నిరంతరం తమ సిబ్బంది వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారన్నారు. తాత్కాలికంగా చెక్పోస్టుల్లో సిబ్బందిని నియమిస్తామన్నారు.

 

నాలుగు వేల మందితో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భద్రత

 

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మొత్తం నాలుగు వేల మంది సిబ్బందితో భద్రత నిర్వహిస్తామని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలలో మొత్తం నాలుగు వేల మంది విధులు నిర్వహిస్తారని గరుడ సేవ రోజున మాత్రం మరో రెండు వేల మంది అదనఅపు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఏ.ఎస్పీ లు 03, డీఎస్పీలు 28, సిఐలు 111, ఎస్సైలు 273, ఏ ఎస్ఐలు/హెచ్ సి లు 979, డబ్ల్యూ పి సి లు 141, పీసీలు 2076, స్పెషల్ పార్టీ లు 121, ఏఆర్/ఏపీఎస్పీ, ఆక్టోపస్, ఇంటెలిజెన్స్ 1100 మంది దాకా భద్రత నిర్వహిస్తారన్నారు.

 

తిరుమల

 

తిరుమలకు వచ్చు భక్తులు ఇబ్బంది పడకుండ ట్రాఫిక్ మళ్లింపు sign boards చూసి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా పోలీస్ వారికి సహకరించాలి. వీలైనంత వరకు భక్తులు APSRTC బస్ లను ప్రయాణం కొరకు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

 

తిరుపతి తిరుమల యందు అపరిచిత వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం మంచిది కాదు. మీ విలువైన వస్తువులు అవసరమైనది తప్ప మీ తో పాటుగా తీసుకొని రాకూడదని కోరుకుంటున్నాము. రూం ల యందు విలువైన వస్తులను ఉంచి మీరు బయటికి వెళ్లరాదు. ఎవరైనా అపరిచిత అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే  పోలీసు వారికి విషయం తెలియపరచాలని కోరుచున్నాము. లేదా Dail 100 కు సమాచారం తెలియపరచాలన్నారు.

 

ముఖ్యంగా భక్తులకు సౌకర్యార్థం 14 పోలీసు సబ్ కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసి, పోలీసు సిబ్బందితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి,  చిన్న పిల్లలు, మతిస్థిమితం లేని వారు, వయోవృద్దులు తప్పి పోకుండా Jio Tagging  ఏర్పాటు చేసి ఉన్నాము. సహాయం కొరకు పోలీస్ వారిని సంప్రదించండి. భక్తులు పోలీసు వారు సూచించిన క్యూ లైన్లలో వెళ్ళి, తొక్కిసలాటలకు తావు లేకుండా ఇతర భక్తులకు కూడా అవకాశం ఇస్తూ సహకరించాలని కోరుచున్నామన్నారు.

 

కొంత మంది దళారులు రూములు ఇప్పిస్తామని మరియు దర్శనాలు ఏర్పాటు చేస్తామని అధిక మొత్తం లో డబ్బులు తీసుకొని మోసం  చేస్తుంటారు అటువంటి దళారులను నమ్మి మోస పోకుండా టి‌టి‌డి వారు ద్వారానే పొందవలేను.

 

మీడియా మరియు ప్రజలకు విజ్ఞప్తి. ఏ విధమైన అసత్య ప్రచారాలను నమ్మవద్దు. మీ చుట్టుప్రక్కల అనుమానాస్పద వక్తులు గాని, అనుమానాస్పద వస్తులను గాని ఉంటే దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బందికి లేక టి‌టి‌డి సిబ్బందికి కానీ తెలియపరిచి పోలీస్ వారికి సహకరించాలని తెలియజేసారు.

 

నేర నియంత్రణ పై ప్రత్యేక చర్యలు

 

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నేరాలను నియంత్రించేందుకు 250 మంది ప్రత్యేక అధికారులు సిబ్బందిని నియమించామన్నారు. ఇప్పటికే తిరుమలలోని 30 ప్రదేశాలలో చైన్ స్నాచింగ్, జిప్ ఓపెనింగ్, బ్యాగ్ లిఫ్టింగ్ లాంటి నేర ప్రదేశాలను గుర్తించారు. ఈ ప్రాంతాలలో వేలిముద్రలు, వ్యక్తి యొక్క మొహాన్ని గుర్తించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించామన్నారు. జిల్లాలోని క్రైమ్ పాత, నేరస్తులు గుర్తించగలిగిన అవగాహన కలిగిన సిబ్బందిని ఈ బందోబస్తు ఉపయోగిస్తున్నారు. తెలంగాణ,  కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల డి.జి.పి లకు వారియొక్క సిబ్బందిని కేటాయించమని కోరడం జరిగిందన్నారు. ఇప్పటికే నాలుగు వందల మంది పాత నేరస్తులకు సంబంధించిన ఫోటోలను జాబితా రెడీ చేశామన్నారు. వీరి కదలికలపై నిరంతరం నిఘా ఉంచామన్నారు. 950 మంది అనుమానితులు, పాత నేరస్తును సత్ప్రవర్తన పై బైండోవర్ చేసుకున్నామన్నారు. లాడ్జీలు, డాబాలు, రైల్వేస్టేషన్, బస్టాండ్, డార్మెటరీ, మడత మంచాలు అద్దెకిచ్చే ప్రదేశాలలో క్షుణ్ణంగా తనిఖీ చేసి తమ అధీనంలోకి తీసుకున్నామన్నారు.

 

30 తేదీ నుంచి ద్విచక్ర వాహనాలు అనుమతి లేదు

 

అక్టోబర్ 1న శ్రీవారి గరుడ సేవ పురస్కరించుకొని సెప్టెంబర్ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరుమలకు ద్విచక్ర వాహనాలను నిషేధించడమైనది. వాహనదారులు అంతా కూడా తిరుపతిలో నిర్దేశించిన అలిపిరి బస్ స్టాండ్ పాత చెక్ పెయింట్ ఇస్కాన్ గ్రౌండ్, మెడికల్ కాలేజి గ్రౌండ్, నెహ్రు మున్సిపల్ గ్రౌండ్ లలో పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు.

 

గరుడ సేవ రోజు ట్రాఫిక్ మళ్ళింపు

 

ట్రాఫిక్  మళ్ళి౦పులు ఉండు సమయం :  తేది.30.09.2022 మధ్యహ్నం 12 గంటల నుండి తేది.02.10.2022 ఉదయం వరకు  ట్రాఫిక్ మళ్లింపులు ఈ క్రింద విధముగా ఉండనున్నది.

 

గరుడసేవ యాత్రికులకు తిరుపతి నందుపార్కింగ్ స్థలములు:

 

1) “దేవలోక్  పార్కింగ్ :- టూరిస్ట్ బుస్సులు మరియు TTD వారు నిర్ణయీంచిన  పరిమితి కి మించిన వాహనాలు టెంపో ట్రావెలర్ , మెట్టడోర్ మొదలైనవి చెర్లోపల్లి నుండి జూ పార్క్ కి సమీపం లో ఉన్న  “దేవలోక్  పార్కింగ్ వద్ద వాహనాలు పార్కింగ్ చేయవలసిఉన్నది.

 

2) భారతీయ విద్యా భవన్ స్కూల్ గ్రౌండ్ :- కార్లు, జీపులు మొదలైన చిన్న  వాహనాలు సైన్స్ సెంటర్ కు ఏదురుగా ఉన్న భారతీయ విద్యా భవన్ స్కూల్ గ్రౌండ్ నందు పార్కింగ్ చేయవలసిఉన్నది.

 

3) ద్విచక్ర వాహనాలు కొరకు:- గరుడ కూడలి వద్ద ఉన్న పాత చెక్ పాయింట్ , ISKON గుడి ఏదురుగా ఉన్న గ్రౌండ్, మెడికల్ కాలేజీ గ్రౌండ్ మరియు మెటర్నటి హాస్పిటల్ కి ఏదురుగా ఉన్న నెహ్రూ మున్సిపల్ స్కూల్ గౌండ్ లో ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయవలసిఉన్నది.

 

పై విధముగా వాహనాలు పార్కింగ్ చేసి తిరుపతి ట్రాఫిక్ పోలీసులకు సహకరించ వలసినదిగా కొరడమైనది. అన్ని ఏర్పాట్లను పకట్బందీగా ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తూ శ్రీవారి బ్రమ్మోత్సవాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా విజయవంతం చేస్తామన్నారు.ఈ కార్యక్రమం నందు అడిషనల్ యస్.పి లు అడ్మిన్ శ్రీమతి ఇ.సుప్రజ  , L &O  కులకేఖర్ , క్రైమ్ విమలకుమారి , యస్.బి డి.యస్.పి రమణ, ట్రాఫిక్ I డి.యస్.పి కాటమరాజు పాల్గొన్నారు.

 

Tags:Tight security for Srivari Brahmotsavam-District SP P. Parameswara Reddy, I,P.S.

Post Midle

Leave A Reply

Your email address will not be published.