మాజీ కలెక్టర్ కు బిగిస్తున్న ఉచ్చు

Date:12/09/2020

మెదక్ ముచ్చట్లు:

లంచం డిమాండ్ చేసిన కేసులో మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నగేష్
అత్యంత సన్నహితులైన ముగ్గురు ఉద్యోగులు అదృశ్యం అయ్యారు. ఏసీబీ సోదాలు ప్రారంభమైన రోజు నుంచి ఆ ముగ్గురు మాయం అయ్యారు. ఎన్‌ఓసీకి అనుమతి ఇవ్వాలని
రిజిస్ట్రేషన్‌ శాఖకు లేఖ రాసిన మెదక్‌ మాజీ కలెక్టర్‌ ధర్మారెడ్డి విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ శాఖ లేఖ విషయం బయటపడింది. పదవీ విరమణ రోజు
ధర్మారెడ్డి ఈ లేఖరాసినట్లు సమాచారం. మాజీ కలెక్టర్‌ ధర్మారెడ్డి పాత్రపై కూడా పలు అనుమానాలు.. వ్యక్తంఅవుతున్నాయి. త్వరలో ధర్మారెడ్డిని సైతం ఏసీబీ అధికారులు
విచారించనున్నట్లు తెలుస్తోంది.భూ వివాదం కేసులో లంచం తీసుకుంటూ నగేష్ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ను సైతం ఏసీబీ
కార్యాలయానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. నగేష్‌ ఇంట్లో భూ డాక్యుమెంట్లు, బినామీ ఆస్తులను గుర్తించారు. వీఆర్వో, వీఆర్‌ఏ పాత్రపైనా ఏసీబీ అధికారులు ఆరా
తీయనున్నారు. నిందితులకు వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 112 ఎకరాల విస్తీర్ణంలో భూమి ఎన్‌ఓసీ ఇవ్వడం కోసం లంచం డిమాండ్
చేశారు.ఎకరాకు లక్ష చొప్పున 1 కోటీ12లక్షలు లంచం డిమాండ్ చేశారు.మొదటగా రెండువిడతల్లో 19.5 లక్షలు, మరో సారి 20.5 లక్షలు అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం
తీసుకున్నారు. అయితే మిగిలిన 72 లక్షలకు గాను 5 ఎకరాల భూమిని నగేష్ బినామీ జీవన్ గౌడ్ కి సేల్ అగ్రిమెంట్ చెయ్యాలని, భూమి రిజిస్ట్రేషన్ అయ్యేవరకు షూరిటీ
కోసం బాధితుడు నుండి 8 ఖాళీ చెక్కులను అడిషనల్ కలెక్టర్ నగేష్ తీసుకున్నాడు. ఈ కేసులో నగేష్‌తో పాటు నర్సాపూర్‌ ఆర్డీవో అరుణా రెడ్డి, చల్పిచేడు తహసీల్దార్‌ అబ్దుల్‌
సత్తార్‌, సర్వేల్యాండ్‌ రికార్డ్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ వసీం మహ్మద్‌, నగేష్‌ బినామీ జీవన్‌ గౌడ్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది.

 

కాంగ్రెస్ లో భారీ ప్రక్షాళన

Tags:Tightening trap to former collector

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *