ప్రలోభాలకు టైమ్…. డబ్బు, మద్యం…

Time for temptations .... money, alcohol ...

Time for temptations .... money, alcohol ...

Date:26/11/2018
రంగారెడ్డి ముచ్చట్లు:
ఓటర్లకు వలవేసేందుకు నేతలు పాడరాని పాట్లు పడుతున్నారు. ఒకరిని మించి ఒకరు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు. ఒకరి ఎత్తులను మరొక పార్టీవారు చిత్తులు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఆరోపణలు గుప్పిస్తూ, ఓట్లను రాబట్టుకునేందుకు అమలుకు నోచుకోని హామీలను గుప్పిస్తున్నారు.ఇక  ఎవరికివారు అనేక రీతుల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి పదిగంటల వరకు బస్తీలు, కాలనీలు, ఆపార్ట్‌మెంట్లు, గ్రామాల్లో అభ్యర్థులతో పాటు నాయకులు, కార్యకర్తలు కరపత్రాలు పంచుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.అదే విధంగా మహాకూటమి, టీఆర్‌ఎస్, బీజేపీ, ఆల్ ఇండియన్ పార్వర్డ్ పార్టీ, బీఎస్పీ, ఇతర పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల ప్రచార రథాలు అన్ని గ్రామాలు, బస్తీలు, కాలనీల్లో మూమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రచార రథాల్లో ఆయా పార్టీలు, అభ్యర్థులను కొనియాడుతూ పాటలతో ఓటర్లను ఆకర్శిస్తున్నాయి. కొన్ని బస్తీల్లో ఒకరు తర్వాత ఒకరు వీధుల్లో ప్రచారం చేస్తుండటంతో ఓటర్లు గందర గోళానికి గురవుతున్నారు. జోరుగా నగదు, మద్యం పంపిణీఎన్నికలోచ్చాయంటే చాలూ బిర్యానీ, మద్యం, నగదు పంపిణీ చేయటం సర్వ సాధారణంగా మారింది.
మరీ ఈ ఎన్నికల్లో కూడా వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో నాయకులు రాత్రి, పగలు అనేతేడా లేకుండా బీరు, బిర్యానీ, నగదు పంపిణీ జోరుగా సాగుతుంది.రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ విచ్చిల విడిగా సమయ పాలనలేకుండా మద్యం, నగదు పంపిణీ జోరుగు సాగుతుంది. ద్వితీయశ్రేణి నాయకులు బస్తీలు, గ్రామాల వారికి గ్రుపులుగా ఏర్పడి రోజంతా ప్రచారం చేస్తూ సాయంత్రం అయితే మద్యం ఏరులై పారుతుంది.ఇక గెలుపుకోసం ఇప్పటికే కుల సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, యువజ సంఘాల నాయకులను మచ్చిక చేసుకొనేందుకు వారికి అవసరమైన వస్తువులు, నగదు, ఇతర తాయిలాలతో మభ్య పెడుతున్నారు. ఎన్నికల సందర్భంగా విచ్చల విడిగా మద్యం పంపిణీ చేస్తుండటంతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అన్ని వైన్‌షాపుల్లో మద్యం కొనుగోలు పెరిగిపోయాయి.టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ ఇతర పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు, ద్వితీయ స్థాయి నాయకులు సైతం ఓట్లకోసం జోరుగా మద్యం  సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
Tags:Time for temptations …. money, alcohol …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *