రూ.1379కోట్లకు అమ్ముడు పోయిన  టైమ్‌ మ్యాగజైన్‌

Date:17/09/2018
వాషింగ్టన్‌ సెప్టెంబర్ ముచ్చట్లు:
అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక మ్యాగజైన్‌ను టైమ్‌ అమ్మేశారు. మెరెడిత్‌ కార్పొరేషన్‌కు చెందిన ఈ మ్యాగజైన్‌ను 190 మిలియన్‌ డాలర్లకు(భారత కరెన్సీలో దాదాపు రూ. 1378.92 కోట్లు) విక్రయించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ప్రముఖ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సంస్థ సేల్స్‌ఫోర్స్‌ సహ వ్యవస్థాపకుడు మార్క్‌ బెనియాఫ్‌ దంపతులు టైమ్‌ మ్యాగజైన్‌ను కొనుగోలు చేశారు.
అయితే మార్క్‌ బెనియాఫ్‌ దీన్ని వ్యక్తిగతంగా కొనుగోలు చేశారని, సేల్స్‌ఫోర్స్‌కు ఎలాంటి సంబంధం లేదని మెరిడెత్‌ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.అంతేగాక.. మ్యాగజైన్‌ రోజువారీ కార్యకలాపాల్లో బెనియాఫ్‌ ఎలాంటి జోక్యం చేసుకోబోరని, ప్రస్తుతం ఉన్న ఎగ్జిక్యూటివ్‌ బృందమే నిర్ణయాలు తీసుకుంటుందని సంస్థ పేర్కొంది.టైమ్ మ్యాగజైన్‌తో పాటు ఫార్చ్యూన్‌, మనీ, స్పోర్ట్స్‌ ఇల్లస్ట్రేటెడ్‌ పబ్లికేషన్లను మెరిడెత్‌ ఈ ఏడాది మార్చిలో అమ్మకానికి పెట్టింది.
తాజాగా టైమ్‌ను అమ్మివేయగా.. మిగతా మూడింటి విక్రయానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు మెరిడెత్‌ వెల్లడించింది. పత్రికల్లో ప్రకటనలు తగ్గిపోవడంతో టైమ్ సహా చాలా మ్యాగజైన్‌లకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దీంతో ఆయా సంస్థలు విక్రయాల బాట పడుతున్నాయి.యాలే యూనివర్శిటీకి చెందిన హెన్నీ లూస్‌, బ్రటన్ హాడెన్‌ ఈ టైమ్‌ మ్యాగజైన్‌ను ప్రారంభించారు. మొదటి పత్రిక 1923 మార్చిలో వెలువడింది.
Tags: Time Magazine, which was sold for Rs 1379 crore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *