తిరుమల కళ్యాణకట్ట క్షురకులకు టైమ్ స్కేల్ వర్తింప జేయాలి
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి ఎంపీ గురు మూర్తికి వినతి పత్రం అందజేసిన కె కె టి కళ్యాణకట్ట క్షురకులు ,తిరుపతి ఎంపీ గురుమూర్తిని ఆదివారం తిరుమల కళ్యాణకట్ట క్షురకులు కలిసి తమకు టైం స్కేల్ వర్తింప చేయాలని వినతి పత్రం అందజేశారు .ఈ సందర్భంగా ఎంపీ గురు మూర్తి స్పందించి టిటిడి అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో ఇచ్చిన హామీ టైం స్కేల్ వర్తింప చేస్తామని పాదయాత్రలో మాట ఇచ్చారన్న విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. సీఎం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తామని అధికారులతో మాట్లాడి తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కె కె టి
కళ్యాణ కట్ట క్షురకులు చెంచు నారాయణ, ఏడుకొండలు, నాగరాజు, నాగార్జున, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Time scale should be applied to Tirumala wedding barbers