పుంగనూరులో రైతులందరికి సకాలంలో వేరుశెనగ విత్తనాలు పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని రైతులందరికి సకాలంలో వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని బోడేవారిపల్లె ఆర్‌బికె లో విత్తనాలు పంపిణీని ఏవో రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీపీ , ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి విత్తనాలను పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ మండలానికి 2,225 క్వింటాళ్ల విత్తనాలు అందిందన్నారు. ఇంకను 200 క్వింటాళ్లు అవసరమని మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించామన్నారు. ఒకొక్క రైతుకు ఒక బస్తా ఇవ్వడం జరుగుతోందన్నారు. అలాగే ఎక్కువ పంట పండించే వారికి 3 బస్తాలు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపారు. వీటితో పాటు జీలుగా 20 క్వింటళ్లు, జనుము 50 క్వింటాళ్లు ఉందని, అవసరమైన వారికి అందిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ల పక్రియ పూర్తికాగానే ఈనెల 29 నుంచి విత్తనాలు 21 ఆర్‌బికె కేంద్రాలలోను పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, జయరామిరెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.

Tags; Timely distribution of groundnut seeds to all farmers in Punganur
