పుంగనూరులో రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు -అక్కిసాని భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం జరుగుతోందని మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని రాగానిపల్లెలో వేరుశె నగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఏవో సంధ్యతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, మందులు , విత్తనాలు అందజేస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో తొలిసారిగా రైతులకు ఏడాదిలోపు భీమా అందజేయడం జరిగిందన్నారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాల కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చంద్రారెడ్డియాదవ్‌, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags; Timely seeds and fertilizers for farmers in Punganur – Akkisani Bhaskarreddy

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *