ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి టైమ్‌స్కేల్ అమ‌లుచేయాలి- మల్లారపు నాగార్జున

-జూలై 3న ధ‌ర్నాను విజ‌య‌వంతం చేయాలి

Date:02/07/2020

తిరుపతి ముచ్చట్లు:

Timescale implementation for outsourcing staff - Nagarjuna

టిటిడి అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్పొరేషన్ ఫ‌ర్ ఔట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్‌(APCOS)లో విలీనం చేసే ప్రక్రియను వెంట‌నే నిలుపుదల చేసి టైమ్‌స్కేల్ వ‌ర్తింప చేయాల‌ని
టిటిడి ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మల్లారపు నాగార్జున డిమాండ్ చేశారు.టిటిడిలోని డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ల సొసైటి స‌ర్వ‌స‌భ్య స‌మావేశం గురువారం తిరుప‌తిలోని య‌శోద న‌గ‌ర్‌లో గ‌ల ఎంబి భ‌వ‌న్‌లో జ‌రిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఆప్కాస్ లో విలీనాన్ని అవుట్సోర్సింగ్ సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. శ్రీ‌వారినే న‌మ్ముకుని ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్నార‌ని, వీరిని టిటిడి నేరుగా కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న తీసుకోవాల‌ని కోరారు. టిటిడిలో భ‌క్తుల‌కు ఎన‌లేని సేవ‌లందిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు అన్యాయం చేయ‌డం త‌గ‌ద‌న్నారు. ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని కోరారు. అనంతరం APCOSలో విలీనం చేయాల‌ని నిర్ణ‌యిస్తూ టిటిడి బోర్డు చేసిన తీర్మానాన్ని వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని సొసైటీ స‌భ్యులు తీర్మానం చేశారు.

 

జూలై 3న ధ‌ర్నాను విజ‌య‌వంతం చేయాలి….

శాస‌నోల్లంఘ‌న, స‌హాయ నిరాక‌ర‌ణ చేప‌ట్టాల‌ని జాతీయ కార్మిక సంఘాలు, ఎన్‌జివోలు ఇచ్చిన పిలుపుమేర‌కు జూలై 3న టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ఎదుట నిర్వ‌హించ‌నున్న ధ‌ర్నా కార్య‌క్ర‌మంలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పెద్ద సంఖ్య‌లో పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని మల్లారపు నాగార్జున పిలుపునిచ్చారు. ఉద‌యం 9 నుండి 10.30 గంట‌ల వ‌రకు ధ‌ర్నా ఉంటుంద‌ని, అన్ని సొసైటీలు, ఏజెన్సీల‌కు చెందిన ఔట్‌సోర్సింగ్ సిబ్బంది త‌ప్ప‌కుండా హాజ‌రుకావాల‌ని కోరారు.ఈ సమావేశంలో టిటిడి కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టి.సుబ్ర‌మ‌ణ్యం, టిటిడి ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ల సొసైటి అధ్య‌క్షుడు హ‌రి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌వీన్ తదితరులు పాల్గొన్నారు.

104 , 108అంబులెన్స్ లను ప్రారంభిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Timescale implementation for outsourcing staff – Nagarjuna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *