భారీ ఆయుధాల కనుగోళ్లకు భారత్
న్యూఢిల్లీ, ముచ్చట్లు:
దేశ రక్షణ కోసం ఆయుధాలు కొనేందుకు కొనేందుకు భారత్ సిద్ధమైంది. భారీ స్థాయిలో ఆయుధాలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2018 నుంచి 2022 మధ్య కాలంలో ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకున్న టాప్-5 దేశాల్లో ఇండియా మెుదటి స్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో సౌదీ అరేబియా, ఖతర్, ఆస్ట్రేలియా, చైనాలు ఉన్నాయి. మరోవైపు… ఎక్కువగా ఎగుమతి చేసిన టాప్-5 దేశాలు.. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీలు వరుసలో ఉన్నాయి.రష్యా ఎగుమతి చేసే ఆయుధాల్లో ఎక్కువగా 31శాతం ఇండియానే కొనుగోలు చేసింది. 2018-22 కాలంలో ఫ్రాన్స్ ఎగుమతి చేసిన ఆయుధాల్లో ఎక్కువ శాతం ఇండియాకే వచ్చాయి. 62 కాంబట్ ఎయిర్ క్రాఫ్ట్స్, 4 సబ్ మెరియన్స్ ఒప్పందాలు జరిగాయి. 2018 కంటే ముందుతో పోల్చితే ఇది 489 శాతం ఎక్కువ. ఈ లెక్కలతో రష్యా తరువాత ఎక్కుగా ఆయుధాలు మనకు ఫ్రాన్స్ నుంచే వస్తున్నట్లైంది. పదేళ్లలో ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశంగా భారత్ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 100 ఆయుధాలు ఎగుమతి అవుతుంటే.. అందులో 11 మన దేశానికే వస్తున్నాయి. 2022 ఏప్రిల్ లో లోక్ సభలో రక్షణశాఖ మంత్రి ఓ మాట చెప్పారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం. ఇందులో భాగంగా దిగుమతులు తగ్గించి మేక్ ఇన్ ఇండియాను ప్రమోట్ చేయాలి.

మేక్ ఇన్ ఇండియా ఆయుధాలతో 2025 నాటికి లక్ష 75వేల కోట్ల టర్నోవర్ సాధించాలి. కానీ, ఆచరణలో మాత్రం ఇతర దేశాల నుంచి దిగుమతులకే ప్రాధాన్యమిస్తోంది.అందుకు ఓ ఉదాహరణే ఈ రిపోర్టు నౌకాదళం, సైన్యానికి అవసరమైన బ్రహ్మోస్ క్షిపణులు, శతఘ్ని వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు, హెలికాప్టర్లు తదితరాలను సేకరించేందుకు దాదాపు రూ.70,584 కోట్లు వెచ్చించనున్నారు.రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఆయుధ వ్యవస్థలన్నింటినీ దేశీయంగానే సమకూర్చుకోనున్నారు.అయితే ఇందులో నేవీ ప్రతిపాదించిన ‘శక్తి’ ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, సముద్ర గస్తీ హెలికాప్టర్లు, ఆయుధాలు, ఇతర పరికరాల విలువే దాదాపు రూ.56వేల కోట్ల మేర ఉంది. సైన్యం కోసం కొనుగోలు చేయనున్న వాటిలో కె-9 వజ్ర-టి, 155ఎంఎం/52 అటాగ్స్ శతఘ్నులు వంటి ఇతర ఆయుధాలున్నాయి. మెరైన్ డీజిల్ ఇంజిన్ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం లభించడం కీలకమైన అంశంగా రక్షణశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇటువంటి ఇంజిన్లను దేశీయంగానే అభివృద్ధిపరచి తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. తాజా ఆమోదంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో సైనికాయుధాలు, పరికరాల కొనుగోళ్లకు రూ.2,71,538 కోట్ల వ్యయానికి ఆమోదం లభించినట్లైంది. ఈ మొత్తంలో 98.9శాతం నిధులను దేశీయ పరిశ్రమల నుంచి సేకరించేందుకే కేటాయించాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయంగా తెలుస్తోంది.
Tags;India for massive arms acquisitions
