తెలంగాణలో తిరంగా పాలిట్రిక్స్

హైదరాబాద్  ముచ్చట్లు:


తెలంగాణలో తిరంగా పాలిటిక్స్ షురూ అయింది. భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని టీఆర్ఎస్పార్టీ ఇంటింటికీ జెండాలు పంపిణీ చేస్తుంటే.. బీజేపీ మాత్రం సొంతంగా కొనుక్కోవాల్సిందేనని ఉచిత సలహాలు ఇవ్వడం గమనార్హం. ‘హర్ఘర్ తిరంగ్’ అని ప్రచారాలు చేస్తున్న బీజేపీ, రాష్ట్రంలో కనీసం ఒక్క ఇంటికి కూడా జెండాలు ఇచ్చే ప్రక్రియ చేయడం లేదు. గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ల వరకు ఏ ఒక్కరూ జెండాలు గురించి స్పందించడం లేదు. అజాదీకా అమ్రిత్ మహోత్సవాలు అంటూ విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారే తప్పా, ర్యాలీలకు అవసరమైన జెండాలు ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా లేదు.

 

 

 

దీంతో సోషల్ మీడియాల్లో బీజేపీపై విమర్షల వర్షం కురుస్తున్నది. ఇంటింటికీ జెండాలు ఇవ్వని బీజేపీని బొంద పెట్టాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపు నిచ్చింది. ఇక ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని మెజార్టీ ఇళ్లకు టీఆర్ఎస్పార్టీ జెండాల పంపిణీని పూర్తి చేసింది. అంతేగాక ”సెలబ్రేటింగ్75 ఇయర్స్ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్”అనే స్టిక్కర్లను కూడా ప్రతీ ఇంటికి అంటించడం గమనార్హం. ప్రతీ ఇంటికి జెండాలు ఇవ్వాల్సిన బాధ్యతలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అప్పగించగా, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు జెండాలు పంపిణీ చేసే బాధ్యతను సీఎం జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతున్నది. జిల్లాల్లో ఆశాలు, ఏఎన్ఎం, అంగన్వాడీలు, రెవెన్యూ ప్రభుత్వం తరపున జెండాలు పంపిణీ చేస్తున్నారు.

 

 

 

అంతేగాక ప్రభుత్వ వాహనాలు, స్టాఫ్వెహికల్స్కూడా జెండాలు తప్పనిసరిగా అందించాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇప్పటికే వివిధ శాఖల వాహనాలకు మూడు రంగుల జెండాను తగిలించుకున్నారు.భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల భవనాలు, వాణిజ్య,వ్యాపార సంస్థలు, ప్రధాన కూడళ్లు విద్యుత్ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని చారిత్రక కట్టడాలు, ప్రధాన జంక్షన్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను వినూత్నంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్బంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రం మొత్తంలో పండగ వాతావరణం నెలకొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ఇచ్చిన పిలుపు మేరకు వివిధ ప్రభుత్వ శాఖ కార్యాలయాలు, వ్యాపార సంస్థలను స్వచ్ఛంధంగా అలకరించుకున్నారు.

 

 

 

ప్రధానంగా హైదరాబాద్ లోని చార్మినార్, మొజాంజాహీ మార్కెట్, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, అసెంబ్లీ, హైకోర్ట్ బీఆర్కేఆర్ భవనం, జీహెచ్ఎంసీ, సీడీఎంఏ కార్యాలయ భవనాలపై చేసిన విద్యుద్దీపాల అలంకరణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా నగరంలోని అనేక మాల్స్ వినూత్న రీతిలో అలంకరించారు. ఈ విద్యుద్దీపాల అలంకరణ ఉన్న భవనాల వీడియోలు సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. వీటితోపాటు, సుప్రసిద్ధ రామప్ప ఆలయం, వేయిస్తంభాల గుడి లాంటి అనేక దేవాలయాలను కూడా ఆకట్టుకునేలా అలంకరించారు. కాగా, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు,

 

 

 

వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ విధిగా విధ్యుత్ దీపాలతో అలంకరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.భారత స్వాతంత్ర వజ్రోత్సవాలకు ఇంటింటికి జెండాలు ఇవ్వలేని బీజేపీ ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వం వెంటనే తొలగిపోవాలని టీఆర్ఎస్ సోషల్మీడియా వింగ్లు విస్తృతంగా విమర్శలు చేస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, వెబ్సైట్లు, వాట్సాప్లు ఇతర తదితర సోషల్ మీడియాల్లో బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీజేపీ కూడా అదే స్థాయిలో వార్ కొనసాగిస్తున్పప్పటికీ.. ప్లగ్లపై వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నది. దీంతో బీజేపీ ప్రకటించిన ‘హర్ఘర్తిరంగ’ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ అడ్వండేజ్ చేసుకొని ప్రజలు మన్ననలు పొందేందుకు మరింత కృషి చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

 

Tags: Tiranga Politrix in Telangana

Leave A Reply

Your email address will not be published.