కలెక్టర్ ఇ.శ్రీధర్

ప్రజల ఆరోగ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు

ప్రజల ఆరోగ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు,
పౌష్టికాహార లోపం నివారణకు ప్రత్యేక చర్యలు
– కలెక్టర్ ఇ.శ్రీధర్

Date:12/06/2019

నాగర్ కర్నూలు ముచ్చట్లు:

ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ శీధర్ అన్నారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో  జిల్లాలోని వైద్యాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారిని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడారు.  నాగర్ కర్నూలు జిల్లా వైద్యఆరోగ్యశాఖ ప్రగతిలో గతంలో  జిల్లా రాష్ట్రంలో 9 స్థానంలో ఉండగా అధికారుల నిర్లక్ష్యం మూలంగా 27 స్థానానికి పడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. సిబ్బంది ప్రతి ఒక్కరు రోగులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. అప్పుడే ప్రభుత్వ దవాఖానలో అందే వైద్య సేవలపై రోగులకు నమ్మకం ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో చేపడుతున్న వివిధ పథకాల ద్వారా ప్రజలలో ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం ఏర్పడుతున్నదన్నారు.

 

 

 

ఈ నమ్మకాన్ని నిలబెట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. జిల్లాలోని అన్ని దవాఖానల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా వైద్య ఆర్యోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.ప్రభుత్వ దవాఖానల్లోని ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఏ మండలాలలో పౌష్టికాహార లోపం ఉన్న గర్భిణులు ఎక్కువగా ఉన్నారో గుర్తించాలని డీఎంహెచ్వో డా. దశరథంను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆ విధంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఇంకా ప్రభుత్వ దవాఖానాల్లో కాన్పులకు రావట్లేదని, ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, 100% కాన్పులు ప్రభుత్వ దవాఖానలోనే జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 2474 కాన్పులు  జిల్లాలో జరిగాయని అత్యధికంగా 1012 కాన్పులు నాగర్ కర్నూల్ ప్రభుత్వ దవాఖానలో జరిగాయని తెలిపారు.

 

 

ఈ ఔషధ లో జిల్లా రెండో స్థానంలో ఉందని ఓపి లో చివరి స్థానంలో ఉందని 10 రోజుల్లో మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని  వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో 5015,19 మందికి పరీక్షలు చేశారని, అందులో అవసరం ఉన్న వారికి 89,650 మందికి కళ్లద్దాలు అందించారని తెలిపారు. టీబీ వ్యాధికి ప్రైవేటు వైద్యులు చికిత్సలు చేస్తే ప్రభుత్వ వైద్యులకు సమాచారం అందించాలని ఆ విధంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని  సూచించారు.
ఈ సమావేశంలో డి ఎం హెచ్ఓ డా. దశరథం జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు, డిప్యూటీ డి ఎమ్ హెచ్ ఓలు డాక్టర్ సుధాకర్ లాల్, డాక్టర్ వెంకట్ దాస్, మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ మీరా రాజ్ పి ఓ టీబి మోహనయ్య డి ఎంఓ శ్రీనివాసులు ఇతర వైద్యులు పాల్గొన్నారు.

ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేష‌న్‌కు మెగాస్టార్ చేయూత

Tags:Tired of people’s health,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *