తిరుమల బస్ చార్జీలు పెంపు

తిరుమల ముచ్చట్లు:


శ్రీవారి భక్తులపై అదనపు భారం పడింది. తిరుమల  శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శనార్థం వచ్చే వారిపై భారం మరింత పెరిగింది. డీజిల్ సెస్ ఛార్జీల పెంపుతో తిరుమల-తిరుపతి మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెరిగాయి. తిరుమల, తిరుపతి  మధ్య తిరిగే ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ప్రతి టికెట్ పై రూ. 15 అదనపు భారం పడింది. ప్రస్తుత ఛార్జీ రూ. 75గా ఉండగా ఇప్పుడది రూ. 90కి చేరింది. పిల్లల టికెట్ ధర రూ. 45 నుంచి రూ. 50 అయింది. రానుపోను టికెట్ ధర రూ.130గా ఉండగా ఇప్పుడది రూ. 160కి చేరింది. కాగా.. ధరల పెరుగులతో అష్టకష్టాలు పడుతున్న సామాన్యులపై ఆర్టీసీ  మరో పిడుగు వేసింది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచింది. నేటి నుంచి బస్సు ఛార్జీలు పెంచుతూ అధికారులు నిర్ణయించారు. డీజిల్‌ సెస్‌ పెంపు వల్ల ఛార్జీలు పెంచక తప్పడం లేదంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు.మరోవైపు.. తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ మంచి అవకాశాన్ని కల్పించింది. తిరుమలకు బస్‌ టికెట్ రిజర్వేషన్‌ చేసుకున్న సమయంలోనే దర్శనం టికెట్టును కూడా బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ సేవలు నేటి నుంచి (శుక్రవారం) అమల్లోకి రానున్నాయి. తెలంగాణ నుంచి తిరుమలకు బస్సులో వెళ్లే భక్తులు ఇకపై ప్రత్యేకంగా దర్శనం టికెట్టును బుక్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. దర్శన టికెట్లను బస్‌ టికెట్‌ చేసుకునే సమయంలోనే టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించారు.

 

Tags: Tirumala bus fare hike

Leave A Reply

Your email address will not be published.