తిరుమల సమాచారం

తిరుమల ముచ్చట్లు:

అంగప్రదక్షిణం

ఆగస్ట్ నెల 2024 కొరకు
1 వ తేది నుండి 31 వ తేది వరకు ఒక నెల రోజులు కోటా ను తేది 23/05/2024 గురువారం ఉదయం 10:00 గంటలకు ఆన్ లైన్ లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారు ప్రతి రోజు 750 టికెట్స్ విడుదల చేస్తారు ఈ టికెట్స్ ఉచితం (ప్రతి
శుక్రవారం దర్శనం ఉండదు )
అంగ ప్రదక్షిణం చేసిన
తర్వాత దర్శనం చేసుకోవచ్చు
1 లడ్డు ఉచితం గా ఇస్తారు రాత్రి 12 గంటల కు స్వామి పుష్కరిణి
(కొనేరు)లో స్నానం చేసి తడి బట్టల తోనే రాత్రి 12 గంటల నుండి 1 గంటల లోపు
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1
లో నుండి వెళ్ళాలి. అంగ ప్రదక్షిణ చేసే వారు రాత్రి కొద్దిగా అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. బోజనము చేస్తే ప్రదక్షిణం చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రదక్షిణం చేసే సమయంలో స్వామి వారి నామాన్ని స్మరించుకోవాలి
స్త్రీలు చీరగాని, పంజాబి డ్రెస్ గాని మగ వారు పంచ, దరించు కోవాలి
( షర్ట్ వేసుకోకూడదు )
ముందుగా స్త్రీలను, తర్వాత పురుషులను పంపిస్తారు బంగారు బావి దగ్గర నుండి హుండి వరకు ఆంగ ప్రదక్షిణం చేయాలి. ఆ సమయంలో సుప్రబాత సేవా జరుగు తుoటుది. తరువాత, జయ విజయుల దగ్గర నుండి, దర్శనంకు పంపిస్తారు. ఈ టికెట్స్ ఉచితం ఒకటి రెండు నిమిషాల్లోనే టిక్కెట్లు అయిపోతాయి .ఉదయం 5 గంటల వరకు దర్శనం చేసుకొని బయటకు వస్తాము. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

వయోవృద్ధులు,
వికలాంగులు దీర్ఘకాలిక వ్యాదిగ్రస్తులు ఆగస్ట్ నెల 2024 కోటా నెలకోటా ను మే 23 వ తేది గురువారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటిడి వారు కోటాను విడుదల చేస్తున్నారు, వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.ప్రతిరోజూ
1000 టికెట్స్ విడుదల చేస్తారు
వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆన్‌లైన్‌లో ఉచిత ద‌ర్శ‌న టోకెన్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైనది. ఓకె సారి రెండు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు సీనియర్ సిటిజెన్ అయితే,65సంవత్సరాలు ఉండాలి.

శ్రీవాణి ట్రస్ట్ దర్శనం మొదటి గడప దర్శనం

శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఆగస్ట్ 1 వ తేది నుండి 31వ తేది వరకు -దర్శనం మరియు వసతి కోటా బుకింగ్ కోసం గురువారం తేది 23/05/2024 11:00 AM కి అందుబాటులో ఉంటుంది
.శ్రీవాణి ట్రస్ట్ కు 10000)- రూపాయలు డొనేషన్ చేసి 500/-tiket తీసుకొని మొదటి గడప దర్శనము చేసుకోవచ్చు.
ప్రతి రోజు 1000 టికెట్స్ ఉంటాయి.అందులో 500.టికెట్స్ ఆన్ లైన్ లో మిగతా 100 ప్లైట్ (విమానం) ద్వారా వచ్చిన భక్తులు తిరుపతి విమానాశ్రయం లో , మిగతా 400 టికెట్స్ JEO office తిరుమల లో ఇస్తారు.కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Rs300, స్పెషల్ ఎంట్రి దర్శనం టికెట్స్
ఆగస్ట్ నెల 2024 కోటా ను మే 24వ తేది శుక్రవారం ఉదయం 10:00 గంటలకు ఆన్ లైన్ లో టీటిడి వారు విడుదల చేస్తున్నారు ఓకె ఫోన్ నంబర్ తో 6 టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అంత కంటే ఎక్కువ మంది ఉంటే ఇంకొక మొబైల్ నంబర్ తో బుక్ చేసుకోవచ్చు.కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

2024 ఆగస్ట్ నెల తిరుమల మరియు తిరుపతి ఆకాంబిడేషన్
తేదీ 24/05/24 శుక్రవారం మధ్యాహ్నం
3 గంటలకు ఆన్ లైన్ లో టిటిడి వారు విడుదల చేస్తున్నారు.
Rs 300 దర్శనం, Rs 500 దర్శనం ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న భక్తులు
,అంగ ప్రదక్షిణం, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ బుక్ అయిన భక్తులకు మాత్రమే, రూములు బుక్ అవుతాయి దర్శనం టికెట్స్ లేని భక్తులకు రూములు బుక్ కావు. దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు ఏ మొబైల్ నంబర్ తో లాగిన్ అయి దర్శనం టికెట్స్ బుకింగ్ చేస్తారో, దర్శనం టికెట్స్ ఎంటర్ చేసి, అకాంబిడేషన్ బుక్ చేసుకోవచ్చు సింగిల్ పర్సన్ కి రూమ్ ఇవ్వరు.
బుక్ చేసుకునే సమయం లో, ఈ పొరపాటు చేయకండి.
రోజు కు 4 స్లాట్ లు ఉంటాయి.

1 వ స్లాట్
రాత్రి 12 గంటల నుండి, ఉదయం 05:59 నిమిషాలు,

2 వ స్లాట్ ఉదయం 06:00 నుండి, మధ్యాహ్నం 11:59 నిమిషాలు,

3 వ స్లాట్ మధ్యాహ్నం 12:00 నుండి, సాయంత్రం 05:59 నిమిషాల వరకు,

4 వ స్లాట్ 06:00 నుండి, రాత్రి 11:59 ,నిమిషాల వరకు,
మీరు తిరుమల,తిరుపతి చేరుకునే సమయమును దృష్టి లో ఉంచుకుని , ప్రతి స్లాట్ కు 6 గంటల సమయం ఉంటుంది. మీరు బుక్ చేసుకున్న సమయం దాటి ఒక్క సెకెండ్ లేట్ అయిన, మీ రూం క్యాన్సల్ అవుతుంది.
మీరు బుక్ చేసుకున్న తేది కి
ఏ కారణం చేత అయిన, రూంని కాన్సిల్ 2 రోజుల ముందు చేస్తే, మీ డబ్బులు మీకు వాపస్ వస్తాయి. మీ అడ్వాన్స్ ఏ అకౌంట్ నుండి బుక్ చేస్తే మీరు రూం ఖాళీ చేసిన తర్వాత, ఆ account లొ కి వారం రోజుల లోపు జమ అవుతాయి. RS 100 , Rs1000 , Rs1518 రుములు అందుబాటులో ఉంటాయి. 1 రోజు రూం బుక్ చేసుకోవచ్చు మీరు ఒక్కరోజు బుక్ చేసుకున్నా ఇంకొక రోజు రద్దీ లేక పోతే గడువు పొడిగించుకోవచ్చు.
Rs 100 రూముకు
Rs 500 అడ్వాన్స్ చెల్లించాలి.
RS 1000 రూముకు Rs 1000 అడ్వాన్స్ చెల్లించాలి Rs 1518 రూముకి Rs 1518 అడ్వాన్స్ చెల్లించాలి. ఈ అడ్వాన్స్ మళ్ళీ మీరు బుక్ చేసుకున్న అకౌంట్ లోకి వస్తాయి. రూము బుక్ అయ్యిన తర్వాత CRO ఆఫీస్ ఎదురుగా ఉన్న ARP కౌంటర్ లో మీరు వెంట తెచ్చుకున్న రిసిప్ట్ ని స్కానింగ్ చేసిన కొద్ది సేపటికే, మీరు ఏ నంబర్ అయితే ఇస్తారో, ఆ నంబర్ మీకు ఆలాట్ అయిన కాటేజీ పేరు SMS సెల్ కి వస్తుంది.
మీకు రూములు దొరకక పోతే, offline తిరుమల లో ఒకే ఒక చోట రూములు ఇస్తారు 1 CRO ఆఫీస్ ఉదయం 04గంటల నుండి 10 గంటల లోపు మనం ఆఫీస్ కి వెళ్తే రూములు త్వరగా దొరికే అవకాశం ఉంది.

శ్రీవారి సేవా, నవనీత సేవ పరకామణి సేవ

ఆగస్ట్ నెల కొరకు
తేది మే 27, ఉదయం 11గంటలకు శ్రీవారి సేవ (వారం రోజుల కొరకు) నవనీత సేవ మధ్యాహ్నం 12గంటల కు, మధ్యాహ్నాం
01: 00లకు పరకామణి సేవ టీటీడి వారు విడుదల చేస్తున్నారు.
స్వచ్ఛంద (వాలంటీర్) శ్రీవారి ఆలయం తిరుమల, లో సేవా చేసుకోవాలనే మీరు తెలుసుకోవలసినది .ఈ సేవ వారం రోజులు ఉంటుంది పురుషులు స్త్రీలు శ్రీవారి సేవ చేసుకోవచ్చు శ్రీవారి సేవా అంటే భక్తులను క్యూ లైన్ లలో పంపడం అన్న సత్రం లో కూరగాయలు తరగడం, భక్తులకు భోజనం వడ్డించడం, త్రాగునీరు పాలు అల్పాహారం అందించడం, లడ్డు కౌంటర్ లలో సిబ్బందికి సహాయం చేయడం, జీడి పప్పు కట్ చేయడం,,కొబ్బరికాయల స్టాల్, పంచగవ్య ఉత్పత్తులు,[అగర్బతులు} లాంటివి అమ్మడం, కళ్యాణ కట్ట దగ్గర క్యూ లైన్ లో పంపడం, పూల మాలలు కట్టడం,భక్తులను క్యూ లైన్ లలో పంపడం అక్కడ మన అవసరం ఉందంటే అక్కడ వెళ్లి సేవ చేయడం మనం చేసే ప్రతి పని శ్రీవారికి చేసినట్లు భావించాలి.
చివరి రోజున దర్శనం కి సుపధం ఎంట్రీ ద్వారా దర్శనం కల్పిస్తారు.
కొన్ని వేల గ్రూపులు సేవ చేయాలనే సంకల్పం తో ట్రై చేస్తున్నారు. అందులో మన గ్రూప్ కి భగవంతుడు అవకాశం కల్పించాడు అక్కడ మన ఊరికి కి, గ్రూప్ లీడర్ కి మచి పేరు తెచ్చే విధంగా సభ్యుల ప్రవర్తించాలి. గ్రూప్ లీడర్ కి ttd వారు సమాచారం అందిస్తారుగ్రూప్ లీడర్ చెప్పినట్లు వినాలి. పురుషులు వైట్ షర్ట్ పాయింట్, మహిళలు ఆరెంజ్ కలర్ చీర మెరూన్ కలర్ అంచు మరియుమెరూన్ కలర్ బ్లౌజ్ ధరించాలి. మహిళలకు సేవ సదన్ 1 లో వసతి కల్పిస్తారు. పురుషులకు సేవ సదన్ 2 లో వసతి కల్పిస్తారు. లాకర్ సౌకర్యం, వేడినీరు సౌకర్యం ఉంటుంది.
బట్టలు బిల్డింగ్ పైన ఉతికి ఆరేసుకోవచ్చు.
శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నసత్రం లో
అల్పాహారం భోజనం చేయాలి . మొదటి రోజు సత్సంగం ఉంటుంది మనం ఏమేమి పనులు చేయాలి విధి విధానాలు చెపుతారు. సేవలో పొరపాట్లు చేస్తే మన గ్రూప్ ని బ్లాక్ చేస్తారు. లడ్డూల దగ్గర, జీడి పప్పు దగ్గర ఎటువంటి ఎంగిలి చేయరాదు పొరపాట్లు చేయకండి. ప్రతి చోట్ల cc కెమెరాలు ఉంటాయి పైన స్వామి వారు చూస్తుంటారు. శ్రీ వారి సేవ అంటే ఎంతో భాద్యతగా పవిత్రంగా చేయాలి.
మధ్యలో ఒక్కరోజు టెంపుల్ డ్యూటీ వేస్తారు.తిరుమలకు ప్రయాణం రాను పోను బస్ గాని, ట్రైన్ గాని ఎవరి ఖర్చులు వారే స్వంతంగా పెట్టుకోవాలి. సేవ సదన్ 2లో రిపోర్ట్ చేయాలి.id కార్డ్స్, స్కార్ప్స్ ఇస్తారు.

పరకామణి సేవ

ఆగస్ట్ నెల కొరకు
తేది మే 27, మధ్యాహ్నం
01: 00లకు పరకామణి సేవ టీటీడి వారు విడుదల చేస్తున్నారు. ఆధార్ కార్డు ఎంప్లాయ్ ఐడెంటిటీ కార్డు అప్ లోడ్ చేయాలి.
పరకామణి సేవ అంటే స్వామి వారి హండి లో భక్తులు వేసే కానుకలను డబ్బులను, బంగారు, వెండి ఆభరణాలను లెక్కించడం లాంటిది. ఈ సేవ ౩ రోజులు శుక్ర , శని, ఆదివారములు, మరియు 4 రోజులు సోమ, మంగళ, గురు,శుక్రవారములుఉంటుంది. కేవలం పురుషులకు మాత్రమే.35 సంవత్సరాల వయస్సు నుండి 65 సంవత్సరాల వయస్సు వారు సేవకు అర్హులు ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంకు ఉద్యోగులు LIC ఉద్యోగులు సింగరేణి ఉద్యోగులు ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగులు అర్హులు. మరియు రిటైర్డు ఉద్యోగులు కూడా బుక్ చేసుకోవచ్చు.సేవ బుక్ అయిన భక్తులు ఒకరోజు ముందుగా శ్రీవారి సేవ సదన్ 2 లో మధ్యాహ్నం 2 గంటల లోపు రిపోర్ట్ చేయాలి.Id కార్డ్ ఇస్తారు.A షిప్ట్ ఉదయం 7గంటల నుండి 10, గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 1గంట నుండి 4 గంటల వరకు మొత్తం 6గంటల డ్యూటీ ఉంటుంది.B షిఫ్ట్ వారు ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు తిరిగి సాయంత్రం4గంటల నుండి, సాయంత్రం 6గంటల వరకు 5గంటల డ్యూటీ ఉంటుంది. సేవ చివరి ఒక రోజు ఉందనగా స్వామి దర్శనం సుఫధం ఎంట్రీ ద్వారా కల్పిస్తారు. ఇంత క్రితం సేవ చేసిన వారు 90 రోజుల గ్యాప్ ఉంటేనే బుక్ అవుతుంది. ఒకరోజు క్రింది తిరుపతి లో కూడా డ్యూటి వేస్తారు టీటీడీ బస్ సౌకర్యం కల్పిస్తుంది.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయం (అలివేలు మంగా పురం)సమాచారం

Rs200, స్పెషల్ ఎంట్రి దర్శనం టికెట్స్
జూన్ నెల 2024 కోటా ను మే 24 వ తేది శుక్రవారం ఉదయం 10:00 గంటలకు ఆన్ లైన్ లో టీటిడి వారు విడుదల చేస్తున్నారు ఓకే ఫోన్ నంబర్ తో 6 టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అంత కంటే ఎక్కువ మంది ఉంటే ఇంకొక మొబైల్ నంబర్ తో బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ నెల టికెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.స్థానిక ఆలయాల (లోకల్ టెంపుల్స్) జూన్ నెలలో మనం ప్రత్యక్షంగా పాల్గొనే ఆర్జిత సేవలు , సేవలు తేది 27/05/24 సోమవారం రోజు ఉదయం 10గంటలకు ఆన్ లైన్ లో టిటిడి వారు రిలీజ్ చేస్తున్నారు.,
స్థానిక ఆలయాలు అంటే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి లోని శ్రీ గోవిందా రాజ స్వామి వారి ఆలయం, అప్పలాయ గుంట ప్రసన్న వేంటేశ్వరస్వామి వారి ఆలయం, శ్రీనివాస మంగా పురం లోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం ఇలా లోకల్ టెంపుల్స్ ఆర్జిత సేవలు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

శ్రీ శ్రీనివాసా దివ్యానుగ్రహ విశేష హోమం తిరుమల 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం తో కలిపి జూన్ నెల కోటా తేది 27/05/2024 సోమవారం ఉదయం 10గంటలకు విడుదల ఈ హోమం టికెట్స్ రోజుకి 150 టికెట్స్ ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. ఒక టికెట్ ధర 1600రూపాయల తో బుక్ చేసుకొంటే ఇద్దరికి తిరుమల స్వామి వారి 300రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఇస్తారు.తిరుపతి అలిపిరి లోని సప్త గో ప్రదక్షిణ శాల లో ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేసి ఉదయం 9గంటల నుండి 11గంటల వరకు హోమం లో పాల్గొని , తిరుమల చేరుకొని మధ్యాహ్నాం 3 గంటలకు ATC సర్కిల్ నుండి స్వామి వారి దర్శనం చేసుకోవచ్చుఒక్క మొబైల్ నంబర్ తో ఒక్క టికెట్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు.

 

Tags: Tirumala information

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *