తిరుమల ముచ్చట్లు:
నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. లక్కీడిప్ టికెట్లు పొందినవారు అదే రోజు మ.12లోపు రుసుము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, వర్చువల్ సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల మధ్యాహ్నం 3 గంటలకు, అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్‌లైన్ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 24న మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శన రూ.300 టికెట్లు కోటాను విడుదల చేయనున్నారు.
Tags: Tirumala Srivari May Month Tickets Released Today