జన జాతర ను తలపిస్తున్న తిరుమల

Tirumala, who is appearing for Jana Satara

Tirumala, who is appearing for Jana Satara

Date:16/04/2018
తిరుమల  ముచ్చట్లు:
తిరుమల జనజాతరను తలపిస్థున్నది. వీకెండ్ రోజులు, ఇంటర్ మీడియట్ పరీక్షా పలితాలు ‌వెలువడటంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. రద్దీ విపరీతంగా ఉన్నడం… ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నడంతో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్వామి వారి‌దర్శనానికి సుమారుగా ఇరవై గంటల సమయం పడుతున్నది. ఏ క్యూలైన్ చూసినా భక్తులతో కిక్కిరిసి పోతున్నది.
 పిలిస్తే పలికే దేవుడు తిరుమలేశుడు. వడ్డి‌చెల్లస్తే చాలు ఎంతటి కష్టాలనైనా అట్టే తర్చేస్తారు. అందుకే ఆ క్షేత్రం నిత్యం భక్తులతో హడావిడిగా ఉంటుంది. ఆ గుడి‌ ముందు ఆ దైవం ముందు… అందరూ దాసులే… నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చెప్పబడే తిరుమల‌క్షేత్రం ఇపుడు భక్తుల గోవింద నామాలతో మారి‌ మ్రోగుతున్నది. వారాంతపు రోజులు రావడంతో తిరుమలకు భక్తులు తరలి వస్తున్నారు. గత రెండు రోజుల క్రితం ఇంటర్ మీడియట్ పరీక్షా పలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఉత్తీర్ణులైన విద్యార్థులు వారివారి కుటుంబ సభ్యులతో తిరుమల క్షేత్రం కు తరలి వస్తున్నారు. వైకుంఠంలో అన్ని కంపార్ట్ మెంట్లు నిండి కిలోమీటర్ల మేర భక్తులు స్వామి దర్శనం కోసం పడిగాపులు కాస్థున్నారు.వాయిస్:- ముఖ్యంగా చెప్పాలంటే కాలి బాటల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆ పరీక్షలు రాయడానికి ముందు తిరుమల వెంకన్నను శరణుకోరుతారు. రాసే పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులైతే తప్పకుండా నీ ఏడుకొండలకి వచ్చి తలనీలాలు సమర్పించి దర్శించి మ్రెక్కులు తర్చుకుంటాము స్వామి అని. అన్న మాట ప్రకారం ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులు ఇపుడు తిరుమల కాలిబాటల్లో నడిచి కొండెక్కుతున్నారు. దీంతో తిరుమలకి వెల్లే రెండు కాలిబాటలు భక్తులతో కిక్కిరిసి పోయింది. గత రెండు రోజుల నుండి చూస్తే అలిపిరి కాలిబాట, శ్రీ వారి మెట్టు కాలి బాటల్లో దాదాపుగా ఎనబై వేల మంది భక్తులు తిరుమలకు వచ్చినట్టు టిటిడి చెబుతుంది. ఇక సర్వ దర్శనం భక్తుల సంఖ్య అదే స్థాయిలో ఉంది. ఏ సర్వ దర్శనం క్యూ చూసినా భక్తులతో నిండి పోయిన పరిస్థితి. ఎప్పటిలాగే రద్దీ ఎక్కువగా ఉన్నడంతో గదులు కాటేజీలు దొరకడం లేదు. పద్మావతీ గదుల కేటాయింపు కేంద్రాలు, సీఆర్ఓ గదుల‌ కేటాయింపు కేంద్రాలు, కౌస్థుభం కేంద్రాలు భక్తులతో నిండి పోయిన పరిస్థితి. గంటలు గంటలు వేచిఉన్నా గదులయ మాత్రం దొరకడం లేదు. కనీసం వస్తువులు భద్రపరుచు కోవడానికి లాకర్లు సైతం అందుబాటులో లేని కారణంగా తిరుమలకు వచ్చిన భక్తులు చాలా అవస్థలు పడుతున్నారు. టిటిడి అదికారులు, విజిలెన్స్ అదికారులు, స్థానిక‌ పోలీసులు సైతం రద్దీని ఎప్పటి కప్పుడు అంచనా వేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే భక్తులు మాత్రం టిటిడి అదికారులను కడిగి పారేస్థున్నారు. రద్దీకి తగ్గ ఏర్పాట్లు చేయడంలో అదికారులు ఘోరంగా విఫలమైయ్యారని అవేదన వ్యక్తం చేస్థున్నారు. ఇదేరద్దీ ఇంకా రెండు రోజులు ఉండే అవకాశం ఉంది.
Tags:Tirumala, who is appearing for Jana Satara

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *