అభివృద్ధి లో తిరుపతి నగరం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి నగరం ఒక వైపు అభివృద్ధి లో జెట్ స్పీడ్ తో దూసుకు పోతుండగా, మరో వైపు ఆధ్యాత్మికత పరిమళాలు వెదజల్లే మార్గంలో పయనిస్తోంది.
తిరుపతి నగరం గత 40 సంవత్సరాల్లో చూడని అభివృద్ధిని టీటీడీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ నాయకత్వంలో ప్రజలు చూడగలుగుతున్నారు. నగరం నలుదిక్కుల రికార్డు సమయంలో మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మించి అటు యాత్రీకులకు, ఇటు స్థానికులకు కూడా మరో 40 ఏళ్ళ పాటు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేస్తున్నారు. 18 మాస్టర్ ప్లాన్ రోడ్లలో సుమారు 15 పూర్తి అయ్యాయి. మరో మూడు నిర్మాణ దశలో ఉన్నాయి.

ఇంత కష్టపడి, సమస్యలను అధిగమించి, అధికారులను పరుగులు పెట్టించి రోడ్లు వేయించిన నాయకులెవరైనా ఏం చేస్తారు? కనీసం రెండు, మూడు రోడ్లకైనా తమ పేరు, తమ తాతలు, తండ్రుల పేర్లు పెడతారు. ఆ రకంగా చూస్తే తిరుపతి లో ” భూమన మార్గం” ” కరుణ రోడ్డు” “అభినయ్ మార్గ్” అనే పేర్లతో కనీసం రెండు, మూడు రోడ్లు కనిపించాలి. అలా పేర్లు పెట్టుకున్నా కాదనే ధైర్యం, వద్దని వారించే సాహసం చేయగలిగే వారు ఎవరూ లేరు. కానీ వీరు అలా చేయలేదు. మాస్టర్ ప్లాన్ రోడ్లతో పాటు, నగరంలో ఆటోలు కూడా ఇబ్బందిగా తిరిగే రోడ్లను, ట్రాఫిక్ అత్యధికంగా ఉండే రోడ్లను ఫ్రీ లెఫ్ట్, ఇతరత్రా అభివృద్ధి పనులు చేసిన రోడ్లకు కూడా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవలో తరించిన మహానుభావుల పేర్లు పెట్టారు.
ఆ పేర్లు కూడా తెలియని ఈ తరం వారికి అలాంటి వారిని పరిచయం చేసే సత్సంకల్పం తీసుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీర్వదించారు. అవరోధాలు పటాపంచలై మాస్టర్ ప్లాన్ రోడ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ పనులు ప్రారంభించే సమయంలో తండ్రి, కొడుకులను తిట్టిన వారే ఇప్పుడు ఈ రోడ్లు సూపర్ అంటూ పొగడుతున్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల పేర్లను ప్రజలకు పరిచయం చేసే చిన్న ప్రయత్నమే ఈ కథనం.
1.రాణి పరాంతకా దేవి మార్గం ( తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి వందల సంవత్సరాల క్రితమే లక్షల విలువ చేసే కానుకలు సమర్పించిన మహా భక్తురాలు.చోళ రాణి)
రేణిగుంట రోడ్డు లోని హీరో హోండా షోరూం తూర్పు వైపు నుండి దక్షిణ దిశగా మున్సిపల్ కార్పొరేషన్ సరిహద్దు వరకు 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డుకు
2. కులశేఖర ఆళ్వార్ మార్గం
( 12 మంది ఆళ్వారుల్లో ఈయన ఒకరు. కలిశకం 28లో చౌర సామ్రాజ్యాన్ని పాలించిన ప్రభువు. విష్ణు భక్తుడు. తిరుమల శ్రీవారిని సేవించిన మహా భక్తుడు.)
రేణిగుంట రోడ్డు హీరో హోండా షోరూం ఎదురుగా గల కొంక చెన్నాయగుంట- తిమ్మినాయుడుపాలెం వరకు ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ 100 అడుగుల రోడ్డు
3. గోదాదేవి మార్గం
( తిరుమల శ్రీవారికి తన పాశురాల ద్వారా సేవ చేసిన మహా భక్తురాలు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును వివాహమాడిన భక్తురాలు)
తిమ్మనాయుడుపాలెం( కాటన్ మిల్లు నుండి కరకంబాడి వరకు) 80 అడుగుల రోడ్డు
4. తిరుప్పావై మార్గం
( కలియుగంలో శ్రీ వేంకటేశ్వర స్వామి అయిన శ్రీ మహా విష్ణువును కీర్తిస్తూ గోదాదేవి రాసిన గీతమాలిక తిరుప్పావై. తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో సుప్రభాతంకు బదులు తిరుప్పావై పఠీస్తారు)
కరకంబాడి రోడ్డులో హెచ్ పి పెట్రోల్ బంక్ నుండి కొత్తపల్లి ఎల్ షేప్ రోడ్డును కలిపే 40 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు
5 ఘట్టి దేవరాయ మార్గం
( 1130 ఫిబ్రవరి 23వ తేదీ శ్రీ రామానుజా చార్యులను పిలిపించి తిరుపతి నగర(అప్పటి గోవిందరాజపురం) నిర్మాణానికి శంఖుస్థాపన చేయించిన మహానుభావుడు)
రేణిగుంట మెయిన్ రోడ్డు నుండి ఆటో నగర్ మీదుగా అంబేద్కర్ కాలనీ దాకా 40 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు
6. వీర నరసింగయాదవ రాయ మార్గం
(1252 లో తిరుమల శ్రీవారి ఆలయ గోపుర నిర్మాణం చేయించారు. ఆనంద నిలయం కట్టించి, తొలిసారి బంగారు పూత వేయించిన పరమ భక్తుడు. యాదవరాజు. చోళ రాజుల సామంతుడు)
తిరుమల బైపాస్ రోడ్డులోని కొర్లగుంట జంక్షన్ నుంచి 40 అడుగుల రోడ్డు
7. అనంతాళ్వార్ మార్గం
( తిరుమలలో పూల తోటలు పెంచి శ్రీవారి కి పుష్పకైంకర్యం చేసిన పరమ భక్తుడు)
రేణిగుంట రోడ్డులోని అంకుర ఆసుపత్రికి తూర్పు నుండి దక్షిణం వైపు కార్పొరేషన్ సరిహద్దు వరకు ఉన్న 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు
8. నమ్మాళ్వారు మార్గం
( విష్ణు దేవాలయాల్లో నాలాయర దివ్య ప్రభంధం పద్యాలు పాడే విధానాన్ని ఏర్పాటు చేశారు. విష్ణు తత్వ ప్రచారకుల్లో ప్రముఖులు. శ్రీమన్నారాయణుడి సేనాధిపతి అయిన విశ్వక్సేనుడి అవతారంగా భక్తులు భావిస్తారు.)
గెస్ట్ లేండేస్ పక్కగా ఉన్న అన్నమయ్య మార్గం లోని
బ్లూ రాక్ రెస్టారెంట్ నుండి శెట్టిపల్లి వరకు వేస్తున్న 80 అడుగుల రోడ్డు
9. జగద్గురు రామానుజాచార్య మార్గం
( తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా విధానాలను స్థిర పరచిన హిందూ ధర్మ ప్రచారకుడు. నడిచే దైవం)
రామానుజ కూడలి నుండి నంది సర్కిల్ వరకు
10. శ్రీకృష్ణదేవరాయ మార్గం
( తిరుమల శ్రీవారిని ఏడు సార్లు దర్శించి వెలకట్టలేని బంగారు, వెండి , వజ్ర ఆభరణాలతో పాటు, భూములను కానుకగా సమర్పించిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి.మహాభక్తుడు.)
లీలా మహల్ సర్కిల్ నుండి కరకంబాడి రోడ్డులో కార్పొరేషన్ సరిహద్దువరకు
11. పెరియాళ్వార్ మార్గం
( విష్ణు చిత్తుడిగా పిలిచే ఈయన 12 మంది ఆళ్వారుల్లో ఒకరు.ఆళ్వారుల శ్లోకాలను దివ్య ప్రబంధంగా సంకలనం చేసిన వారు. వైష్ణవ తత్వ ప్రచారకులు)
మున్సిపల్ ఆఫీస్ నుండి లీలా మహల్ సర్కిల్ వరకు ఉన్న రోడ్డు
12. తరిగొండ వెంగమాంబ మార్గం
( తిరుమల శ్రీ వారిని తన కీర్తనలతో స్తుతించిన మహా భక్తురాలు)
ముత్యాల రెడ్డిపల్లి సర్కిల్ నుండి మ్యూజిక్ కాలేజ్ దాకా ఉన్న రోడ్డు
13. తిరుమల నంబి మార్గం
( తిరుమలలో పూల తోటలు పెంచి శ్రీవారికి ప్రతి రోజు పుష్ప కైంకర్యం చేసిన గొప్ప భక్తుడు)
కరకంబాడి రోడ్డు నుండి మానస సరోవర్ హోటల్ వరకు 40 అడుగుల రోడ్డు
14. అన్నమయ్య మార్గం
( తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని తన సంకీర్తనలతో సేవించిన మహా భక్తుడు.తొలి తెలుగు వాగ్గేయ కారుడు)
కరకం బాడి రోడ్డులోని గెస్ట్ లేండేస్ హోటల్ పక్క నుండి రేణిగుంట రోడ్డు లోని రైల్వే గేట్ వరకు ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్డు
15. పురందరదాసు మార్గం
( తిరుమల శ్రీవారిని తన కీర్తనలతో సేవించిన కర్ణాటక ప్రాంతానికి చెందిన మహా భక్తుడు)
టౌన్ క్లబ్ సర్కిల్ నుండి గరుడ సర్కిల్ దాకా ఉన్న రోడ్డు
16. శ్రీశ్రీశ్రీ పరమాచార్య చంద్రశేఖర సరస్వతి మార్గం
( కంచి కామకోటి పీఠాధిపతుల్లో ఒకరు. నడిచే దైవంగా భక్తులు కొలిచే హిందూ ధర్మ ప్రచారకులు. తిరుమల శ్రీవారిని పూజించిన భక్తుడు)
రేణిగుంట రోడ్డు లోని భార్గవి టైల్స్ పక్కగా దక్షిణం వైపు మున్సిపల్ కార్పోరేషన్ పరిధి వరకు నిర్మించిన 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు.
ఇవి కాక
శ్రీమతి పంగులూరి సీతమ్మ మార్గం
( శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయానికి పూర్వమే సుమారు 100 ఎకరాలు దానం ఇచ్చిన మహిళ)
ఎం ఆర్ పల్లి నుండి మహిళా యూనివర్సిటీ వరకు నిర్మించిన 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు.
Tags:Tirupati city in development
