Natyam ad

సైబర్ క్రైమ్ బాధితునికి సకాలంలో న్యాయం చేసిన తిరుపతి సైబర్ క్రైమ్ పోలీసులు -జిల్లా ఎస్పీ   పి.పరమేశ్వర రెడ్డి

తిరుపతి  ముచ్చట్లు:

బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి సైబర్ నేరగాళ్లు మోసం చేసి దోచేసిన రూ.2,70,000/- రూపాయల నగదును క్రెడిట్ కార్డుకి వాపసు చేయించిన జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు.జిల్లా ఎస్పీ   పి.పరమేశ్వర రెడ్డి ఐపియస్.,  ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ కేసును చేదించి, వివరాలను వెల్లడించిన సైబర్ క్రైమ్ సీఐ ఓ. రామచంద్రారెడ్డి.తిరుపతి జిల్లా, చంద్రగిరి పోలీస్ సబ్ డివిజన్, తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుచానూరు లో నివాసం వున్న హిమగిరి బాబు అనే అతనికి ఒక అనుమానిత వ్యక్తీ నుండి 04-10-2023 వ తేదిన ఫోన్ కాల్ వచ్చింది మరియు ఆ సస్పెక్ట్ నెంబర్ నుంచి బాధితునికి whatsaap ద్వారా ఒక link కూడా సెండ్ చేయడం జరిగింది. హిమగిరి బాబు అది తెలియకుండా సస్పెక్ట్ link కు ఓపెన్ చేసి తన మొబైల్ నెంబర్ మీద OTP ని వెరిఫికేషన్ చేశాడన్నారు. ఆ తరువాత బాధితుని యొక్క బజాజ్ ఫైనాన్సు క్రెడిట్ కార్డు నందు వరుసగా రూ.80,136/-, రూ.40,068/-, రూ.69,900/-, రూ.80,136/-, రూ.25,058/- రూపాయల లావాదేవీలు (మొత్తం రూ.2,70,000/- లు) జరిగినట్లు గుర్తించడం జరిగిందన్నారు. తనకు తెలియకుండా తన క్రెడిట్ కార్డు నుంచి నగదు మాయమవడంతో బాధితునికి ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో తిరుపతి పోలీసు పెరేడ్ మైదానం నందు ఉన్నజిల్లా సైబర్ క్రైమ్ ఆఫీస్ కు వచ్చి పిర్యాదు చేసాడన్నారు.ఆ పిర్యాదును అందుకున్న సైబర్ సెల్ సీఐ జిల్లా ఎస్పి పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., కి కేసు పూర్వాపరాలను వివరించగా, ఎస్పీ  త్వరగా అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేసి బాధితుడు పోగొట్టుకున్న మొత్తం నగదును తిరిగి రిఫండ్ చేయండని ఆదేశాలు ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన సైబర్ క్రైమ్ సిఐ రామచంద్ర రెడ్డి మరియు సిబ్బంది బాధితుని యొక్క డెబిట్ మెసేజ్ లను గమనించి, లావాదేవీలు అన్నీయూ ప్రముఖ ఆన్లైన్ వ్యాపార సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ (flipkart) కు జరిగినట్లు గుర్తించామన్నారు. వెంటనే సంబంధిత ఫ్లిప్ కార్ట్ నోడల్ అధికారులతో సంప్రదించి, సదరు అనుమానాస్పద ఐదు లావాదేవీల గురించి తేలియపరచడం జరిగింది. అందుకు ఫ్లిప్ కార్ట్ నోడల్ అధికారులు సకాలంలో వెంటనే స్పందించి సదరు 5 లావాదేవీలను రద్దు(cancel) చేయుట కొరకు చర్యలు తీసుకున్నరన్నారు.

 

 

Post Midle

అయితే అప్పటికే అన్ని లావాదేవీలకు సంబంధించిన OTP దృవీకరణం(verification) పూర్తి అయ్యింది. అందులో ఒక లావాదేవీ ద్వారా ఎక్కువ విలువైన OPPO మొబైల్ ను EMI పద్ధతి ద్వారా బుక్ చేయడం జరిగింది. అయినా కూడా ఫ్లిప్ కార్ట్ నోడల్ అధికారులు సైబర్ క్రైమ్ పోలిసుల వినతి మేరకు సదరు ఐదు లావాదేవీలను రద్దు(కెన్సెల్) చేసారన్నారు. తద్వారా బాధితుని నుంచి మోసగించబడిన మొత్తం రూ.2,70,000/-ల నగదును తిరిగి అతని బజాజ్ క్రెడిట్ కార్డులో 23-10-2023 వ తేదిన జమ అవ్వడం జరిగిందన్నారు.ఈ సైబర్ కేసులో బాధితునికి న్యాయం జరిగింది అంటే అతను సకాలంలో స్పందించి సైబర్ క్రైమ్ ఆఫీసుకు రావడం వలన మేము సంబంధిత నోడల్ ఆఫీసర్స్ తో సంప్రదించి మోసపోయిన మొత్తం నగదును రిఫండ్(refund) చేసి, బాధితుడికి సకాలంలో న్యాయం చేయగలిగామన్నారు. ఈ కేసు చేదనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ సీఐ రామచంద్రారెడ్డి మరియు సైబర్ క్రైమ్ సిబ్బంది వారిని జిల్లా ఎస్పీ  పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., అభినందించి, రివార్డులను ప్రకటించడం జరిగిందన్నారు.తిరుపతి జిల్లా ప్రజలు ఎవరయినా సైబర్ క్రైమ్ బారిన పడినట్లయితే అధైర్య పడకుండా వెంటనే పోలీస్ పెరేడ్ మైదానం నందు ఉన్న సైబర్ క్రైమ్ ఆఫీస్ కు వచ్చి పిర్యాదు చేయాలనీ కోరారు. సైబర్ క్రైమ్ కు గురైన వారు గోల్డెన్ అవర్ 24 గంటల లోపు సైబర్ క్రైమ్ ఆఫీస్ కు వెళ్ళినట్లయితే మీకు న్యాయం జరిగే అవకాశం మెండుగా ఉంటుంది లేదా మీరు అందుబాటులో లేనట్లయితే వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చును లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ  పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,  ప్రజలకు విజ్ఞప్తి చేశారన్నారు.

 

Tags:Tirupati Cyber Crime Police who gave timely justice to the cyber crime victim

Post Midle