Natyam ad

తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం.

తిరుపతి  ముచ్చట్లు:

రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతంగా ఉండే పుణ్యక్షేత్రం అయిన తిరుపతి జిల్లాను అల్లకల్లోలం చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇది కేవలం ఊహాజనికంగా రాజకీయంగా వాడుకోవడం కోసమే ఇలాంటి మాటలు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, ఇందులో ఎలాంటి నిజం లేదు, అనాలోచితంగా ఇలా మాట్లాడటం సబబు కాదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 1.435 కేజీల లిక్విడ్ గంజా అక్రమ రవాణాన్ని గుర్తించి అరెస్టు చేసి, రిమాండ్ చేయడం జరిగింది. పోలీస్ శాఖ, సెబ్ సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి 173 గంజాయి కేసులు నమోదు చేసి, 336 మందిని అరెస్టు చేసి, 1,430 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు 43 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా తిరుపతి నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా గంజాయి వంటి మత్తు పదార్థాలకు ప్రజలను దూరంగా ఉండేటట్లు చేస్తూ ఎలాంటి ఘటనలు జరగకుండా నిరోధిస్తున్నామన్నారు. యువగళం పాదయాత్రలో లోకేష్ గంజాయి సరఫరా జోరుగా సాగుతోందని అనడాన్ని ఖండిస్తున్నాము. యువగళం పాద యాత్ర సందర్భంగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించడాన్ని కూడా ఖండిస్తున్నాము. గంజాయి వాడకం, సరఫరాలో భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ముందుందని లోకేష్ అనడం సరికాదు.

 

 

Post Midle

తిరుపతి నగరంలో పోలీస్ శాఖ గంజాయిని అరికడుతోంది. 3500 కిలోల గంజాయిని నాశనం చేసాము. రాష్ట్ర వ్యాప్తంగా 10,400 చోట్ల ప్రజల కొరకు హోర్డింగ్స్ పెట్టి అవగాహన కల్పించాం. 10,500 కాలేజీల్లో విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాం. జిల్లా వ్యాప్తంగా 158 చోట్ల ప్రజల కొరకు హోర్డింగ్స్ పెట్టి అవగాహన కల్పించాం. 90 కాలేజీల్లో విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా 2020-2021 సంవత్సరంలో 7500 ఎకరాల్లోని గంజాయి పంటను నాశనం చేయడం జరిగింది. 2022లో రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ఇరవై వేల కేజీల గంజాయిని సీజ్ చేశాం. పోలీస్ శాఖ ప్రజల్లో గంజాయి పై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. డ్రగ్స్ వాడకం,అక్రమ రవాణా పై పోలీస్ శాఖ,సెబ్ ఉక్కుపాదంతో అణిచి వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల కిలోల గంజాయిని, వేల మందిని పట్టుకున్నాం. అవసరమైతే పిడి యాక్టు కేసులు కూడా నమోదు చేశాం. పోలీస్ వ్యవస్థ చట్ట ప్రకారం నడుచుకుంటుంది. జిల్లా ఎస్పి శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపిఎస్.,

 

గురువారం జిల్లా ఎస్పి పి. పరమేశ్వర రెడ్డి ఐపిఎస్., గారు తన కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, తేదేపా జాతీయ కార్యదర్శి  నారా లోకేష్  తిరుపతి జిల్లాలో పాదయాత్ర చేస్తూ, ఆంధ్రప్రదేశ్ గంజాయి సాగు, ఉత్పత్తి లో దేశంలోనే మెదటి స్థానంలో ఉందని విమర్శిస్తూ కొన్ని వాక్యాలు చేశారు, అలాగే గౌరవ భారత ప్రధాన మంత్రి కి, ఎన్.సి.బి. డిజి గారికి, భారత హోం శాఖ కార్యదర్శి గారికి లేఖలు రాశానని అన్నారు. ఇది ఏ మాత్రం సమంజసం కాదు. ఆయన నిజాలు తెలుసుకోకుండా ఇలా చేయడాన్ని పోలీసు శాఖ తరపున ఖండిస్తున్నాము అని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్.జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు రాష్ట్ర డి.జి.పి  కే.రాజేంద్రనాథ్ రెడ్డి, ఐ.పి.యస్.,  సూచనలతో ఆపరేషన్ పరివర్తనలో భాగంగా మన రాష్ట్రంలో గంజాయి సాగు చేసే ఆంధ్రా మరియు ఓడిస్సా సరిహద్దు జిల్లాలైన అల్లూరి సీతా రామరాజు జిల్లా, ఏజెన్సీ మండలాలలో 2021-2022 సంవత్సరంలో 7,515 ఎకరాల్లోని, 2022-2023 లో 1,039 ఎకరాల్లోని గంజాయి పంటను నాశనం చేయడం జరిగింది. అలా జీవనాధారం కోల్పోయిన వారికి వేరే వ్యవసాయ మార్గాలను కూడా చూపించడం జరిగిందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 2022 సంవత్సరంలో 1,766 కేసులు నమోదు చేసి 4,095 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి సుమారు 1,35,755 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. 2023 సంవత్సరం ఇప్పటి వరకు 261 కేసులను నమోదు చేసి 629 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 6,877 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. గత సంవత్సరంలో పట్టుబడి స్వాధీనం చేసుకొన్న సుమారు 3,10,030 కేజీల గాంజ ను విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూర్, తిరుపతి మరియు కర్నూల్ జిల్లాలలో డిసెంబర్ నెలలో నాశనం చేయడం జరిగింది.

గంజాయి సాగు అక్రమ రవాణా ను అరికట్టడానికి ఆంధ్ర మరియు ఓడిస్సా సరిహద్దు జిల్లాల నందు 15 చెక్ పోస్ట్ లను ఏర్పాటుచేసి పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగింది. భారత ప్రభుత్వ 2021-2022 రిపోర్ట్ ప్రకారం CRPF వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల సహకారంతో ఉమ్మడిగా దాడులు నిర్వహించి రాష్ట్రంలో 18,267 కేజీల గంజాను సీజ్ చేసి 90 మంది ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ భారతదేశంలో ఆంద్రప్రదేశ్ గంజాయి అక్రమ రవాణాలో మొదటి స్థానంలో ఉందని చెప్పడం పూర్తిగా అవాస్తవమని దీనికి ఉదాహరణ పై తెలిపిన ఘనాంకాలే తెలుపుతున్నాయని, రాజకీయ పరంగా ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతోనె నాయకులు మాట్లాడుతున్నానని అన్నారు.

జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ, సెబ్ అధికార సిబ్బంది సంయుక్తంగా మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చుటకు జిల్లా సరిహద్దుల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, అనుమానిత వాహనాలను తనిఖీ చేస్తున్నాము. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన కూడళ్ళు, బస్సు స్టేషన్ , రైల్వే స్టేషన్ వంటి 158 చోట్ల హోర్డింగ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించాము. 90 కళాశాలలో మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన సదస్సులను నిర్వహించి, 90 డ్రగ్స్ ప్రివెన్షన్ కమిటి లను కూడా ఏర్పాటు చేసి విద్యార్థులలో డ్రగ్స్ వాడకాన్ని అరికట్టి, వారు సత్ప్రవర్తనతో మెలిగే విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు.

2014-2019 వరకు తిరుమల లో ఎక్సైజ్ శాఖ వారు 7 కేసులను నమోదు చేసి, 9 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి, 12,300 గ్రాముల గాంజ ను సీజ్ చేస్తే, 2020-2023 వరకు కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదు అయ్యింది, అది కూడా 4 రోజుల క్రితము కూరగాయల వ్యానులో తరలిస్తుండగానే పట్టుకుని ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి, 200 గ్రాముల గాంజ ను సీజ్ చేశామన్నారు. అనవసరంగా పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమలను అప్రతిష్ట పాలు చేయకండని నారా లోకేష్ ని కోరారు.

తిరుపతి జిల్లాలో 2014-2019 వరకు సెబ్ ఫార్మ్ కాక ముందు పోలీస్ రికార్డ్స్ ప్రకారం 51 కేసులను నమోదు చేసి, 162 మంది నేరస్తులను అరెస్ట్ చేసి, 2,400 కేజీల గాంజ ను సీజ్ చేసాము. 2020-2023 వరకు పోలీస్ శాఖ , సెబ్ సంయుక్తంగా 194 కేసులను నమోదు చేసి, 336 మంది ముద్దయిలను అరెస్ట్ చేసి, 2,578 కేజీల గాంజ ను సీజ్ చేశాము. సీజ్ చేయబడిన పాత 3,500 కేజిల గాంజ ను దహనం చేయడం జరిగిందన్నారు.

ఈ కేసులకు సంబంధించిన నేరస్తులలో 77 మందిపై హిస్టరీ షీట్స్ ఓపెన్ చేశాము, 5 మందిపై పిడి యాక్ట్ కేసులను నమోదు చేశాము, 34 మందిని బైండ్ ఓవర్స్ చేసి మాదక ద్రవ్యాల సరఫరాను ను సమూలంగా అరికట్టేందుకు పోలీస్ శాఖ, సెబ్ అధికార సిబ్బంది రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నారని, కాబట్టి నిజా నిజాలు తెలుసుకోకుండా తిరుపతి నగరం గురించి అనైతికంగా మాట్లాడి, మీ విలువను తగ్గించుకోకండని అలాగే యువగలం పాద యాత్ర సందర్భంగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించడాన్ని కూడా కండిస్తున్నామని శ్రీ నారా లోకేష్ గారిని కోరారు.
ఈ కార్యక్రమంలో సెబ్ జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర, ఎస్బి డిఎస్పి సురేంద్ర రెడ్డి మరియు డి.సి.ఆర్.బి. సిఐ చంద్ర శేఖర్ పిళ్ళై పాల్గొన్నారు.

Tags: Tirupati is a spiritual city.

Post Midle