కృషితో తిరుపతి మరింత అభివృద్ది సీఎం చంద్రబాబు 

Tirupati is more developed with the work of Mr. Chandrababu

Tirupati is more developed with the work of Mr. Chandrababu

Date:22/09/2018
తిరుపతి ముచ్చట్లు:
పచ్చని తిరుపతి అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా తయారు చేయాలి. ఇప్పటికే జాతీయ స్ధాయిలో తిరుపతికి నివాసయోగ్యప్రాంతాలలో నాలుగో స్ధానం వచ్చింది. రాబోయే రోజుల్లో తిరుపతి మొదటి స్ధానం రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం అయన తిరుపతిలో పర్యటించారు. పచ్చని తిరుపతి – అత్యంత ఆవాసయోగ్యమైన తిరుపతి’ అనే నినాదంతో ఎన్టీఆర్  విగ్రహం నుంచి ర్యాలీని ప్రారంభించారు.
తిరుపతి టౌన్ క్లబ్ నుంచి ర్యాలీ గా విద్యార్థులతో నడుచుకుంటూ నెహ్రు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్ కి చేరుకున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ విద్యార్థులు కృషితో తిరుపతి మరింత అభివృద్ధి చెందాలి. మేము ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశామో ఇప్పటికే చెప్పాం. లక్ష ఉద్యోగాల భర్తీ కి మా ప్రభుత్వం ఆర్ధిక అనుమతులు ఇచ్చింది .ఆ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఉద్యోగాలు భర్తీ చేసేందుకు 6 నెలల నుంచి ఏడాది పడుతుందని అయన అన్నారు.
Tags:Tirupati is more developed with the work of Mr. Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *