కోవిడ్ ఆస్పత్రులుగా టిటిడి అతిథి గృహాలు

Date:30/06/2020

చిత్తూరు  ముచ్చట్లు:

తిరుమల తిరుపతి దేవస్థానం అతిథి గృహాలన్నీ కోవిడ్ ఆస్పత్రులుగా మారిపోతున్నాయి. ఇప్పటికే తిరుపతి పద్మావతి నిలయం, ఆ తర్వాత వికృతమాలలోని వేలాది గృహాలను క్వారంటైన్‌గా మార్చారు. తాజాగా శ్రీనివాసంను కోవిడ్ ఆస్పత్రిగా మార్చాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే మాధవం అతిథి గృహాన్ని.. డాక్టర్లు ఎవరికైనా కరోనా సోకితే వాళ్లకు క్వారంటైన్‌గా ఈ గృహాన్ని వినియోగిస్తారు. చిత్తూరు జిల్లాలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 1473 కేసులు నమోదు కాగా 534 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఆరుగురు మృతి చెందారు. 933 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న తిరుపతి ఎంపీ  

Tags:Tirupati MP who visited Sri Sri Sri Muthiyalamma Amman…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *