Tirupati MP who visited Sri Sri Sri Muthiyalamma Amman

శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న తిరుపతి ఎంపీ  

Date:30/06/2020

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా  చిల్లకూరు మండలం ,తూర్పు కనుపూరు గ్రామంలో భక్తుల పాలిట కొంగుబంగారమై వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని మంగళవారం  తిరుపతి పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ రావు దర్శించుకున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి  నేపథ్యంలో ప్రజాహితం కోరి, ప్రజల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో మార్చి 23 నుండి  అమలవుతున్న లాక్ డౌన్ తర్వాత , తొలిసారిగా ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకీ పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు తగ్గాలని, వీలున్నంత త్వరగా కరోనా వైరస్ బలహీన పడి, కనుమరుగవుతుందని అమ్మవారి కృప కటాక్షాలు ప్రజలందరికీ మెండుగా ఉంటాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోవైకాపా సీ ఈ సీ సభ్యులు కొడవలూరు దనుంజయ రెడ్డి , వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరందరికీ కీ ఆలయ కమిటీ చైర్మన్  మురళి రెడ్డి ,ఈ ఓ జనార్దన్ రెడ్డి ,కమిటీ సభ్యులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలోసీనియర్ నాయకులు చెవురూ నాగేశ్వరరావు, వైకాపా యువజన విభాగం జాయింట్ సెక్రటరీ చింతా సునీల్ రెడ్డి  పాల్గొన్నారు. అనంతరం కనుపురు సచివాలయ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు.

భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు శిరసావహిస్తున్నాం: టిక్‌టాక్

Tags: Tirupati MP who visited Sri Sri Sri Muthiyalamma Amman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *