తిరుపతిలో నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు స్టార్ట్
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలో నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు రెస్టారెంట్ హెడ్ కుకింగ్ కిచన్ సెంటర్ ను జబర్దస్త్ ఆర్టిస్ట్ కిరాక్ ఆర్పి గురువారం ప్రారంభించారు.తరువాత ఆర్పీ మాట్లాడుతూ హైదరాబాదులో నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు ను ప్రజలు స్వాగతించారని సిటీ లో అందుకే నాలుగు ప్రాంతాలలో ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఏపీలో అనంతపురం లో హోటల్ నిర్మాణ పనులు సాగుతున్నాయని తిరుపతిలో హెడ్ కిచెన్ సెంటర్ తో పాటు మరో నాలుగు ప్రాంతాలలో నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు రెస్టారెంట్ ను నగర ప్రజలకు అందుబాటులో కి త్వరలో తెస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా చాపల పులుసు ఎంత ఫేమస్ అంటే అందరికీ తెలుసు. చేపలు పేరు ఎత్తగానే గుర్తుచేది నెల్లూరు పేరే అని చెప్పారు.సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఉన్న …చులకన చేసే వాళ్ళు ఎక్కువమంది ఉండడంతో సొంతంగా బ్రతకాలని ఆలోచనతో నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు రెస్టారెంట్ ను ప్రారంభించడం జరిగిందన్నారు.
నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు ప్రత్యేకత కట్టెల పొయ్యి మీద వండడం. పాతకాలంలో కట్టెల పొయ్యి వంటకాలు ఎంతో రుచికరంగా ఉండేవని తెలిపారు. నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు రెస్టారెంట్ ను పెట్టాలన్న ఆలోచన ను మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు కు మొదటగా తెలియజేశానని ఆయన సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని హామీ ఇచ్చి తోడ్పాటు అందించాడని కొనియాడారు.త్వరలో తిరుపతి నగరంలో మొత్తం ఐదు ప్రాంతాలలో నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు బ్రాంచ్లు ఒకేసారి సినీ తారలు రాజకీయ నాయకులతో ప్రారంభిస్తున్నామని మీడియాకు తెలిపారు. డబ్బులు సంపాదించాలని కాకుండా నెల్లూరు చేపల పులుసు ను అందరికీ ఇవ్వాలని ఉద్దేశ్యంతో ప్రారభించామని అయన అన్నారు.

Tags: Tirupati Nellore Peddareddy fish soup start
