వ్యాపారిని బెదిరించిన ఇద్దరు యువకులను అరెస్టు చేసిన తిరుపతి పోలీసులు

Date:07/08/2020

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి పేరునుపయోగించి వ్యాపారిని బెదిరించిన ఇద్దరు యువకులను అరెస్టు చేసిన తిరుపతి పోలీసులు తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్​రెడ్డి పేరుతో ఓ వ్యాపారిని బెదిరించిన ఘటనలో ఇద్దరు యువకులను తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్​కు చెందిన కేశవరెడ్డి, తిరుపతికి చెందిన ప్రతాప్​లు వ్యాపారం చేశారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డబ్బును కేశవరెడ్డి.. ప్రతాప్​ను అడిగాడు. దీంతో ప్రతాప్ బంధువైన హరిబాబు, అతడి స్నేహితుడు తౌసిఫ్ కలిసి తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి పేరుతో కేశవరెడ్డికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. ప్రతాప్ తన బంధువనీ.. అతడిని డబ్బులు అడగవద్దని.. అడిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అనుమానం వచ్చిన కేశవరెడ్డి, తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై జయచంద్ర కేసు నమోదు చేసుకొని.. ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. బెదిరింపులకు ఉపయోగించిన ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా అధికారుల పేరుతో బెదిరింపులకు దిగితే.. భయపడవద్దనీ.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్సై సూచించారు.

అప్పు తిరిగి చెల్లించనందుకు వ్యక్తిపై కొడవలితో దాడి

Tags: Tirupati police have arrested two youths for threatening a businessman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *