తిరుపతి ట్రాఫిక్ సమస్యలకు త్వరలో పరిష్కారం

-పట్టణంలో మూడు రైల్వే అండర్ బ్రిడ్జిలు త్వరలో నిర్మాణం

 

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసే భక్తులతో తిరుపతి పట్టణంలో ట్రాఫిక్ నిత్యం పద్మావ్యూహన్ని తలపించేలా ఉంటుంది. రైల్వే లైన్ కి ఇరువైపులా పట్టణం విస్తరించి ఉండటంతో రైల్వే గేటుల సమీపంలో వాహన చోదకుల ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం.ఈ సమస్యలన్నిటికి పరిష్కారం దిశగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గుంతకల్లు డివిజన్ రైల్వే డి.ఆర్.ఎం తో చర్చించి సమస్య తీవ్రతను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.నేడు పట్టణంలోని ప్రధాన ప్రాంతాలయిన హీరో హోండా షోరూం వద్ద ఎల్.సి-107, కాటన్ మిల్లు దగ్గర ఎల్.సి-108, రైల్వే సి.ఆర్.ఎస్ వద్ద ఉన్న ఎల్.సి-109, అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి ఖర్చు భాగస్వామ్య పద్దతిలో అంగీకారం తెలపడమైనది. ఈ ఉత్తర్వుల ప్రకారం నిర్మాణానికి అయ్యే ఖర్చులో రైల్వే శాఖ భరించే విధంగా మరో సగం తిరుపతి నగర పాలక సంస్థ ఖర్చు చేసే విధంగా అంగీకారిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. నగరపాలక సంస్థ విధానపరమైన అనుమతులు మంజూరయ్యాక అండర్ బ్రిడ్జిల పనులు మొదలవుతాయని ట్రాఫిక్ కష్టాలు తీరురుతాయాని అన్నారు. ఈ సందర్బంగా తిరుపతి గురుమూర్తి గారు హర్షం వ్యక్తం చేశారు.

 

Tags: Tirupati traffic problems to be resolved soon

Leave A Reply

Your email address will not be published.