Natyam ad

పుంగనూరులో తలమానికంలా టిట్కో గృహాలు -చైర్మన్‌ ప్రసన్నకుమార్‌

– 53,112 మందికి లభ్ధి
– ఒకొక్కరికి రూ.10 లక్షలు విలువ చేసే ఇండ్లు
-బాబు జీవో 58ని రద్దు చేసి లబ్ధిచేకూర్చాం

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

రాష్ట్ర చరిత్రలో ఎన్నడులేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి 27 పట్టణాల్లో టిట్కో గృహాలు నిర్మించి 53,112 మంది కుటుంభాలకు లబ్ధిచేకూర్చడం జరిగిందని, చంద్రబాబునాయుడు ఇచ్చిన జీవో 58ని రద్దు చేసి రూ.2.65 లక్షల నగదు చెల్లించేపనిలేకుండ లబ్దిదారులకు ప్రభుత్వం లాభం చేకూర్చిందని రాష్ట్ర టిట్కో చైర్మన్‌ ప్రసన్నకుమార్‌ తెలిపారు. శనివారం ఆయన మున్సిపాలిటిలో టిట్కో గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి అవాస్‌యోజన పథకం క్రింద నిర్మిస్తున్న గృహాల్లో మనరాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. యూపి, మధ్యప్రదేశ్‌ ర్ఖా•లలో గృహ నిర్మాణాలు వెనుకబడ్డాయన్నారు. కానీ మన రాష్ట్రంలో సుమారు 30 లక్షల గృహాలు జగనన్న కాలనీలలో నిర్మించడం జరుగుతోందన్నారు. టిట్కో గృహాలను అన్ని వసతులతో నిర్మించడం జరిగిందన్నారు. గతంలో ధరావత్తుగా చెల్లించిన నగదును లభ్ధిదారులు వాపస్సు ఇవ్వడం జరుగుతోందన్నారు. రిజిస్ట్రేషన్లు చేసి లబ్దిదారులకు గృహాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏముఖ్యమంత్రి చేయని విధంగా జగనన్నపాలనలో ప్రతి ఒక్కరికి పక్కాగృహాలు నిర్మించడం రికార్డు సృష్టించడమేనన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రజలందరు జగనన్న మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండేలా ఆశీర్వధించాలని కోరారు. ఈయన వెంట రాష్ట్రజానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, ఈఈ వెంకటముని, డీఈఈ బలరామయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Titco Homes like Talamanikam in Punganur – Chairman Prasanna Kumar

 

Post Midle