పుంగనూరులో టిట్కోగృహాలు పంపిణీకి సిద్దం – కమిషనర్‌ నరసింహప్రసాద్‌

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో పేద ప్రజలకు టిట్కోగృహాలను రిజిస్ట్రేషన్లు చేసి పంపిణీ చేసేందుకు సర్వం సిద్దం చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మున్సిపాలిటిలోని 31వ వార్డుల్లోను పేద లబ్ధిదారుల కోరిక మేరకు 1536 గృహాలు అన్ని వసతులతో సుందరంగా నిర్మించడం జరిగిందన్నారు. లబ్ధిదారులందరికి వారికి కేటాయించిన ఇండ్లకు జియోట్యాగింగ్‌ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం లబ్ధిదారులందరికి రిజిస్ట్రేషన్లు చేసి, ఇండ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు కొనసాగిస్తామని తెలిపారు. అలాగే మున్సిపాలిటిలో గూడూరుపల్లె, రాగానిపల్లె, ఎన్‌ఎస్‌.పేట ప్రాంతాల్లో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసేందుకు 1582 మంది లబ్ధిదారులకు స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు. వీటిలో 639 ఇండ్లు పూర్తి కావస్తోందన్నారు. మిగిలిన గృహాలను త్వరగా నిర్మించేందుకు లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు చే అవగాహన కల్పిస్తూ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయిస్తామన్నారు. జగనన్న కాలనీలలో అన్ని రకాల మౌళిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

 

Tags: Titcohouses ready for distribution in Punganur – Commissioner Narasimha Prasad

Leave A Reply

Your email address will not be published.