ఏ ఎస్ పి సంతోష్ పంకజ్ కు శుభాకాంక్షలు తెలియజేసిన టిఎన్జీవో అధ్యక్షులు డెక్క
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
భద్రాచలం ,ఏ ,ఎస్ పి గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పరితోష్ పంకజ్ ను భద్రాచలం డివిజన్ డిఎన్జీవో అధ్యక్షులు డెక్క నరసింహారావు నేతృత్వంలో శుక్రవారం భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ, అసిస్టెంట్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్న ఉద్యోగం అన్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడం వల్ల కొంత సమస్యాత్మకంగా ఉంటుందని దానిని పరితోష్ పంకజ్ సమర్థవంతంగా ఎదుర్కొంటారని, విశ్వాసము ఉందని ఆయన అన్నారు. ఏ ఎస్ పి, పంకజ్ మాట్లాడుతూ ప్రజలకి అన్నివేళలా అందుబాటులో ఉంటానని శాంతి భద్రతను కాపాడటంలో అహర్నిశలు కృషి చేస్తానని, చట్టానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాల కు పాల్పడే వ్యక్తులు ఎంత పెద్ద వారైనా ఎవరైనా క్షమించేది లేదని అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడ బోమని ఆయన హెచ్చరించారు. సెక్రెటరీ గగూరి బాలకృష్ణ మాట్లాడుతూ భద్రాచలంలో ఉద్యోగం చేయటం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. అలాగే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య ఆశీస్సులు నిత్యము ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ పడిగ నరసింహారావు గాంధీ లింగమూర్తి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Tags:TNGO President Dekka congratulated ASP Santosh Pankaj

