ఈ నెల 23 న టీఎన్ టియుసి జనరల్ బాడీ సమావేశం..
బెల్లంపల్లి ముచ్చట్లు:
సింగరేణి లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి గోదావరిఖనిలో ఈనెల 23 ఆదివారం టి ఎన్ టి యు సి, అనుబంధ కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్య అధితిగా టి ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు ఎం కె బోస్, పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు జనరల్ సెక్రెటరీ బీ సంజయ్, టి ఎన్ టి యు సి జనరల్ సెక్రెటరీ రత్నాకర్ రావు హాజరుకానున్నారు.సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా,సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి కార్మికులు ఏకం కావాలి, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తూ, మొదటి క్యాటగిరి వేతనం ఇవ్వాలని పలు డిమాండ్లతో కూడిన సమావేశం నిర్వహిస్తున్నామని సమావేశం కు 11 ఏరియాలలో ఉన్న ముఖ్యమైన కార్యకర్తలు నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు, ఈసమావేశం కు టిఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు ఎం కె బోస్, పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు జనరల్ సెక్రెటరీ బీ సంజయ్, టి ఎన్ టి యు సి జనరల్ సెక్రెటరీ రత్నాకర్ రావు, రాష్ట్ర నాయకులు కొంచెం భూపతి, టి ఎన్ టి యు సి ఉపాధ్యక్షులు మరి రామ్ సింగ్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఏడుకొండలు హాజరుకానున్నారని అనిటిఎన్ టి యుసి నాయకులు మనిరామ్ సింగ్ తెలిపారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags; TNTUC General Body Meeting on the 23rd of this month.