శాఖలకు సలహదారులేందుకు ?

అమరావతి ముచ్చట్లు:

దేవాదాయశాఖ సలహాదారుగా జె.శ్రీకాంత్ నియామకంపై హైకోర్టు స్టే విధించింది. శ్రీకాంత్ నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయిన విషయం తెలిసింది. బుధవారం నాడు పిటిషన్ పై సీజే ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. శ్రీకాంత్ నియామక జీవోను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇలానే వదిలేస్తే రేపు అడ్వకేట్ జనరల్ను సలహాదారుని నియమిస్తారు. సలహాదారులను నియమించేందుకు అధికారుల కొరత ఉందా. సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారన్నారని  హైకోర్టు వ్యాఖ్యానించింది. మంత్రులకు సలహాదారులు ఉంటే అర్థం ఉంది. శాఖలకి సలహాదారు ఏమిటని ప్రశ్నించింది.

 

Tags: To advise the departments?

Post Midle
Post Midle