సకాలంలో అమరావతి నిర్మాణం పూర్తి

To complete the construction of Amravati timely

To complete the construction of Amravati timely

Date:26/11/2018
నెల్లూరు ముచ్చట్లు:
ఈ గవర్నెన్స్ లో భాగంగా మున్సిపల్ పరిపాలన విభాగాన్ని పూర్తిగా ఆన్లైన్ చేశాం. టాక్స్ లు, బిల్లులు ఆన్లైన్లో చెల్లించడమే కాక బిల్డింగ్ పర్మిషన్స్, లేఔట్ పర్మిషన్స్ కూడా ఆన్లైన్ ద్వారా ఇస్తున్న మొదటి రాష్ట్రం మనదేనని మంత్రి నారాయణ అన్నారు. సోమవారం నాడు అయన నాలుగున్నరేళ్ల లో మున్సిపల్ శాఖ సాధించిన విజయాలపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.  మంత్రి మాట్లాడుతూ క్రిటికల్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద 12,600 కోట్లతో 110 మున్సిపాలిటీల్లో మంచి నీరు మురుగునీరు నిర్వహణ రోడ్లు పార్కులు స్మశానాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద రెండు వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించాం. 14వ ఆర్థిక సంఘం కింద 1400 కోట్లు, స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ కింద 190 కోట్లు, అమృత్ పథకంలో 3700 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని అన్నారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సహకారంతో 50 మున్సిపాలిటీల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించే ప్రాజెక్ట్ చేపట్టాం. గ్రీన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 110 మున్సిపాలిటీల్లో పచ్చదనానికి ప్రాధాన్యం ఇచ్చాం. ఇప్పటికే 87 మున్సిపాలిటీల్లో 200 కిలోమీటర్ల మేర రోడ్డు డివైడర్ల సుందరీకరణ పూర్తి చేశామని అన్నారు.
మొత్తం 38,265 కోట్లతో పట్టణ పేదలకు 9. 58 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. అత్యుత్తమైన shirwal టెక్నాలజీ ద్వారా పేదలకు ధనవంతుల తో సమానమైన సౌకర్యాలతో ఇళ్లను నిర్మించి ఇస్తున్నాం. 5 రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం అందించే ఉద్దేశ్యంతో పట్టణ ప్రాంతాల్లో 216 గ్రామీణ ప్రాంతాల్లో 152 అన్న క్యాంటీన్లు నిర్మిస్తున్నాం. ఇప్పటికే 145 అన్న క్యాంటీన్ల నిర్మాణం పూర్తి చేసి 134 ప్రారంభించామని అన్నారు. మెప్మా మహిళలకు 11. 3 వేల కోట్ల రూపాయలను లింకేజ్ ద్వారా, 1568 కోట్ల రూపాయలను పసుపు కుంకుమ కింద, 472 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు, 550 కోట్ల రూపాయలు స్త్రీ నిధి ద్వారా అందించాం. 10. 5 లక్షల స్వయం సహాయక సంఘం కుటుంబాల సంవత్సరాదాయం 1. 2 లక్షలకు చేర్చాం. నిరు పేదలకు కార్పొరేట్ విద్యను అందించడానికి అంగన్వాడీలను ప్రీస్కూల్స్ గా మార్చామని అన్నారు.
మున్సిపల్ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి కెరీర్ ఫౌండేషన్ కోర్స్ ప్రారంభించాం. నెల్లూరులో ప్రయోగాత్మకంగా మునిసిపల్ జూనియర్ కళాశాలను స్థాపించి తిరుగులేని విజయాలను సాధించాం. స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో భాగంగా రెండేళ్లకే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు గా మార్చామని మంత్రి వివరించారు.  స్వచ్ఛ సర్వేక్షన్ 2018 లో విజయవాడకు బెస్ట్ క్లీన్ సిటీ, తిరుపతికి మోస్ట్ లివబుల్ సిటీ గా కీర్తి గడించాం. దేశంలోని మొత్తం 4500 మున్సిపాలిటీల్లో టాప్ 330 మున్సిపాలిటీలో 33 ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలు ఉండడం గర్వకారణం. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా, కేంద్రం సహకరించకున్నా అమరావతి నిర్మాణంలో పురోగతి సాధించాం. నాలుగువేల క్వార్టర్ల నిర్మాణాన్ని ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తున్నాం. సివిల్ కోర్టు భవనాల నిర్మాణాన్ని జనవరి కే పూర్తి చేస్తున్నామని అన్నారు. జగన్,  పవన్,  మోడీ కలిసిపోయి ఎన్ని కుట్రలు చేసినా అమరావతి నిర్మాణం పూర్తి చేసి తీరుతామని అన్నారు.
Tags:To complete the construction of Amravati timely

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *