రాజకీయాల్లో షష్టి పూర్తి చేసుకోవాలి : మంత్రి యనమల

To complete the scope of politics: Minister Yanamala

To complete the scope of politics: Minister Yanamala

Date:27/02/2018
అమరావతి ముచ్చట్లు:
నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్ధికమంత్రి యనమల శుభాకాంక్షలు తెలిపారు. 34ఏళ్లు మీతో పనిచేసే అవకాశం దక్కడం మా అదృష్టం. ప్రధాన కార్యదర్శిగా టిడిపికి ఒక దిక్సూచిగా చంద్రబాబు వ్యవహరించారని వ్యాఖ్యానించారు. సంక్షోభాల్లో అవకాశాలు వెదకడంలో మీకు మీరే సాటి  అని ను ప్రశంసించారు మీ బ్రాండ్ ఇమేజివల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. రాజకీయాల్లో షష్టి పూర్తి చేసుకోవాలన్నదే మా అందరి ఆకాంక్షఅని అన్నారు. మీ సమర్ధ నాయకత్వమే రాష్ట్ర నిర్మాణానికి సాధ్యమని ఏపి ప్రజలు 2014లో గెలిపించారు. టిడిపి నిర్మాణంలో, సమర్ధ నాయకత్వంలో చంద్రబాబుకు సాటి ఎవరూలేరని అన్నారు.
పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ మా అందరికీ రాజకీయ ఓనమాలు దిద్దించారు,సమర్ధ నాయకులుగా తీర్చిదిద్దారు. 40ఏళ్ల రాజకీయంలో వేలాది నాయకులను తీర్చిదిద్దిన ఘనత మీదేన్నారు. సంస్కరణల్లో,ఐటి వినియోగంలో,రైతన్నల సంక్షేమంలో,మహిళా స్వావలంబనలో దేశానికే దిక్సూచి చంద్రబాబు. గతంలో వే టు ఢిల్లీ త్రూ యూపి అనేవారు.దానిని వే టూ ఢిల్లీ త్రూ ఏపిగా మార్చారని అన్నారు. మీతో పనిచేయడం పది విశ్వవిద్యాలయాల్లో చదవడంతో సమానమని అన్నారు.
Tags;To complete the scope of politics: Minister Yanamala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *