పుంగనూరులో సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు – ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే నవరత్నాల పేరుతో అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికి అందించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం గడప గడపకు మన ప్రభుత్వం మూడవ రోజు కార్యక్రమాన్ని మండలంలోని బైలుగానిపల్లె, గుడిసెబండ, గూడూరుపల్లె, పెంచుపల్లె గ్రామాల్లో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మంత్రి పీఏ చంద్రహాస్‌, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమబావుట పుస్తకాలను పంపిణీ చేసి, సంక్షేమ పథకాల గూర్చి వివరించారు. పెన్షన్లు, గృహాలు, అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవేన, గోరుముద్ద, రుణమాఫి, జగనన్న విద్యాకానుక పథకాలు అందిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు అన్ని పథకాలు అందాయని సంతృప్తి వ్యక్తం చేశారు. జగనన్న బావుట పుస్తకంలో వివరించిన మేరకు అన్ని పథకాలు అందాయని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా వలంటీర్ల ద్వారా తెలియజేస్తే తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు సచివాలయాలను వేదిక చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు శోభ, శంకరప్ప, నారాయణరెడ్డి, వెంకటరెడ్డి, మునస్వామి, రాజారెడ్డి, ఎంపీటీసీలు నంజుండప్ప, వేమారెడ్డి, నాగరాజ, శివకుమార్‌, సూరప్ప, వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, హేమాద్రి, రాజశేఖర్‌రెడ్డి, రాగానిపల్లె బాబు, ప్రభాకర్‌నాయక్‌, చంద్రారెడ్డి యాదవ్‌, వెంకటరెడ్డి, గురివిరెడ్డి , నారాయణరెడ్డి, రెడ్డెప్ప, బాలచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: To implement welfare schemes in Punganur – MPP Akkisani Bhaskar Reddy

Leave A Reply

Your email address will not be published.