To improve the financial status of the RTC .. Study of the Committee of experts

ఆర్టీసీ ఆర్థిక స్థితి మెరుగు కోసం..నిపుణుల క‌మిటీ అధ్య‌య‌నం

Date:10/08/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ మరింత ఆర్ఙిక పురోగతిని సాధించేందుకై రాష్ట్ర పభుత్వం మార్గ నిర్ధేశకాలతో ఏర్పాటైన  నిపుణుల బృందం శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖైరాతాబాద్లోని ఆస్కీలో జరిగిన సమావేశంలో  పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. టి.ఎస్‌.ఆర్టీసీని బాగా లోతుగా అధ్య‌య‌నం చేసి అభివృద్ధి ప‌థంలో న‌డ‌వ‌డానికి కావ‌ల్సిన ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించి త‌గు స‌ల‌హాలు, సూచ‌న‌లు చేయ‌డానికి ప్ర‌భుత్వం మార్గ నిర్ధేశాలు జారీ చేసింది.  ఈ క్ర‌మంలో రవాణా ప్రణాళిక, ఆర్థిక,   పట్టణ రవాణా వ్యవస్థ అధ్యయంన‌కు సంబంధించిన అంశాలపై నిపుణులు వారి వారి అభిప్రాయాల‌ను  వెల్లడించారు.  ఈ సందర్భంగా టి.ఎస్.ఆర్.టి.సి అధ్యక్షులు శ్రీ సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ, నేటి జీవన వేగం బాగా పెరిగిందని, ఈ మేరకు ప్రయాణీకుల సమయం చాలా విలువైంద‌ని చెబుతూ గమ్యస్ధానాలు చేరేందుకు ఇతర మా మార్గాలను అనుసరిస్తున్న ప్రయాణీకులకు వేగవంతమైన ప్రయాణం అందించేందుకు తగిన బస్వే లను సమకుర్చుకుంటే ఆదాయం పెంచుకోవడానికి ఆస్కారం ఏర్పడుతోందని సూచించారు.  టూ విలర్స్, ఫోర్ విలర్స్, ఇతరత్ర వాహనాలలో వెళ్తున్న ప్రయాణీకులు బస్సుల్లో ప్రయాణించగలిగితే ట్రాఫిక్ రద్ధీ తగ్గుతుందని చెప్పారు.  ప్రయాణీకుల మెరుగైన సేవలు అందిస్తున్న టి.ఎస్.ఆర్.టి.సి ఆర్థిక పురోగతిని సాధించేందుకై పలు చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో న‌డుస్తున్న బ‌స్సుల ద్వారా న‌ష్టాలు రావ‌డం ఒక టి.ఎస్‌.ఆర్టీసీలోనే కాదు అన్ని ర‌వాణా సంస్థ‌ల‌లోనూ ఇదే ప‌రిస్థ‌తి నెల‌కొని ఉంద‌న్నారు. సామ‌న్య ప్ర‌జ‌లు త‌క్కువ ధ‌ర‌తో ఆయా గ‌మ్య‌స్థానాల‌కు చేర‌వేస్తూ   సేవ‌లు అందిస్తున్న ఆర్టీసీకి ప్ర‌భుత్వం త‌గు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తోంద‌ని చెప్పారు.  సంస్థ మేనేజింగ్   డైరెక్టర్, టి.ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ మాట్లాడుతూ, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు నెలలో ఒక్కసారైనా బస్సుల్లో ప్రయాణించి సందేశం ఇవ్వగలిగితే  ప్రయాణీకులు కూడా బస్సుల్లో ప్రయాణించేందుకు మరింత  మొగ్గు చూపుతారన్నారు.  కింది స్థాయి వారే కాక పై స్థాయి వారు సైతం అప్పుడప్పుడు బస్సుల్లో ప్రయాణించి ఆదరిస్తే సంస్థ మరింత ఆర్థిక పురోభివృద్ధిని సాధించగల్గుతుందన్నారు. నెల‌లో ఒక సారి బ‌స్ డే గా పాటించేందుకు ప్రముఖులు ముందుకు రావాల‌ని సూచించారు. బి.ఎం.టి.సి మాజీ ఛైర్మన్ శ్రీ నాగరాజు  యాదవ్ బెంగ‌ళూరులో ఎదుర్కొన్న స్వీయ అనుభ‌వాల‌ను చెబుతూ ఆయా రూట్లలో బస్సుల పెంచాలని రాజకీయ నాయకులు సంస్థ అధికారులను ఒత్తిడికి గురిచేస్తుంటారని, వారి ప్రమేయాన్ని నివారించగలిగితే ఆర్టీసీ కొంత ఆదాయాన్ని సమకూర్చుకోగలదనే అభిప్రాయాన్ని వెల్లడించారు. కె.ఎస్‌.ఆర్టీసీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ శ్రీ ఆనంద‌రావు, రిటైర్డ్ ఇ.డి శ్రీ డి.వేణు మాట్లాడుతూ, రూట్ల‌ను హేతుబ‌ద్దీక‌ర‌ణ చేసి ప్ర‌యాణీకుల ర‌వాణా అస‌రాల మేర‌కు స‌ర్వీసుల‌ను పెంచేందుకు త‌గిన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల్సి ఉంద‌న్నారు.  ప్రయాణీకుల రద్దీ ప్రాంతాలలో బస్సులను పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరో సభ్యుడు శ్రీ అంథోని కుమార్ తాను ఆస్ట్రియాలో గమనించిన రవాణా వ్యవస్థ తీరుతెన్నులను వివరించారు. అక్కడి ప్రజలు ప్రజా రవాణానే ఆదరిస్తారని, సొంత వాహనాలను అవసరమైన మేరకే వినియోగించడంతో ప్రజా రవాణా మెరుగ్గా ఉంటుందన్నారు. అక్క‌డి ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను ఇక్క‌డ అమ‌లు ప‌ర‌చ‌డానికి గ‌ల సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలిస్తే బాగుంటుంద‌ని త‌న అభిప్రాయాన్ని చెప్పారు. సి.ఐ.ఆర్‌.టి మాజీ ఫ్యాక‌ల్టీ హ‌నుమంత‌రావు, ఆస్కీ డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్ వి. శ్రీనివాస్ చారి, ఫ్యాక‌ల్టీ  సుద‌ర్శ‌న్ పాదంలు మాట్లాడుతూ, ప్ర‌యాణీకుల ర‌వాణా అవ‌స‌రాల‌ను గుర్తించి ఆ మేరకు బ‌స్సు సౌక‌ర్యాలు క‌ల్పిస్తే మెరుగైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని చెప్పారు.  తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌ లో లోతైన అధ్యయనం,  పరివర్తన వ్యూహాలను రూపకల్పన కోసం ఒక సమగ్ర నివేదిక‌,  దేశంలోని ఒకే సంస్థ ద్వారా సమాజంలోని వివిధ వర్గాలకు విస్తరించిన వివిధ రాయితీల పరిశీలన‌, ప్రస్తుత వనరులతో అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యయాన్ని తగ్గించడానికి ప్రణాళికలపై కూడా సుదీర్ఘంగా చ‌ర్చించారు.
Tags:To improve the financial status of the RTC .. Study of the Committee of experts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *