కిషన్ కు, సంజయ్ కు

Date:28/05/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణలో 4 ఎంపీ సీట్లు సాధించడంతో బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇదే ఊపుతో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర నేతలకు కీలక పదవులు, బాధ్యతలు అప్పజెప్పాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నారు. మోదీ కేబినెట్‌లో తెలంగాణకు చోటు దక్కుతుందని.. కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి దాదాపు ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు నిజామాబాద్‌లో కేసీఆర్ కూతురు కవితపై విజయం సాధించిన ధర్మపురి అరవింద్‌కు సహాయమంత్రి పదవి దక్కవచ్చని తెలుస్తోంది.అటు తెలంగాణ రాష్ట్ర యూనిట్‌లోనూ కీలక సంస్కరణలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. యూత్‌లో మంచి క్రేజ్‌ ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పజెప్పాలని కమలం పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. అలాంటి నేతను పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే రాష్ట్రంలో పార్టీ బలోపేతమవుతుందని యోచిస్తున్నారు. ఇక ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌ను జాతీయ పార్టీలోకి తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.మరోవైపు తనను కరీంనగర్ ఎంపీగా గెలిపించిన ప్రజలకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలను పక్కనబెట్టి పూర్తిస్థాయిలో అభివృద్ధిపైనే దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు. పార్టీ ఇప్పటికే తనకు రెండు సార్లు కార్పొరేటర్‌, మరో రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్‌తో పాటు ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. తనకు కేంద్ర మంత్రి పదవి కావాలన్న అత్యాశ లేదని వెల్లడించారు.

పాకిస్తాన్ తప్ప..మిగతా దేశాధి నేతలు

 

Tags: To Kishan, to Sanjay

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *