Natyam ad

మోడీకి… మాదిగ దండోరా…

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీకీ అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు ఎమ్మార్పీఎస్ నుండి నిరసన సెగ తగిలేలా ఉంది. జులై మొదటి వారంలో హైదరాబాద్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించబోతున్న బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో గతంలో బీజేపీ నేతలు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి సంశయిస్తుండటంతో ఎమ్మార్పీఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎస్సీ వర్గీకరణ అంశం బీజేపీకి మింగమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది.రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందాలని.. అది జరగాలంటే ముందు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ వాదిస్తోంది. ఇదే అంశంపై సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో ఈ ఉద్యమానికి బీజేపీ మద్దతిస్తూ వస్తోంది. గతంలో తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ పెద్దలు లేఖలు రాశారని, తీర్మానాలు చేశారని ఎమ్మార్పీఎస్ వాదిస్తోంది. అయితే అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు వర్గీకరణ అంశంపై అతీగతీ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వర్గీకరణ విషయంలో బీజేపీ పచ్చిమోసానికి పాల్పడిందని మందకృష్ణ మాదిగ మండిపడుతున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకోక తప్పదని, జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆ పార్టీ నేతలు ఎలా హైదరాబాద్‌కు వస్తారో..

 

 

 

Post Midle

ఢిల్లీకి ఎలా వెళతారో చూస్తామని హెచ్చరించారు. జులై 2న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యే రోజున ఆ ఆవేదన రోడ్డెక్కుతుందని స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో జులై 2,3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవవర్గ భేటీ నేపథ్యంలో ఆ రెండు రోజులు నిరసన కార్యక్రమాలకు ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చింది. 2వ తేదీన జాతీయ రహదారుల దిగ్బంధం, 3న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల్లోని జాతీయ రహదారులను దిగ్బంధనం చేసి సడక్ బంద్ నిర్వహిస్తామని వార్నింగ్ ఇచ్చారు.ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టకపోవడంతో మాదిగలు గుర్రుగా ఉంటే మాల సామాజిక వర్గం వారు సైతం బీజేపీ తీరు పట్ల ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బిల్లు విషయంలో చొరవ తీసుకుంటామని బీజేపీ గతంలో చేసిన ప్రకటననే ఈ ఆగ్రహానికి కారణం. ఎస్సీల జనాభాను మాదిగ నేతలు తప్పుగా చెబుతున్నారని మాల సంఘాల నేతలు అభ్యంతరాలు చెబుతున్నారు. మాదిగ నేతల డిమాండ్లకు బీజేపీ వత్తాసు పలుకుతోందని మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య ఆరోపిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాదిగల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి చర్యలు మానుకోకుంటే రాబోయే ఎన్నికల్లో కిషన్ రెడ్డిపై 200 మందితో నామినేషన్ వేస్తామని ఇటీవల చెన్నయ్య ప్రకటన చేశారు. దీంతో వర్గీకరణ ఇష్యూ బీజేపీ విషయంలో ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.

 

Tags: To Modi … Madiga Dandora …

Post Midle