చదువు కావాలంటే 3 కిలోమీటర్లు నడవాల్సిందే

Date:14/08/2019

మెదక్ ముచ్చట్లు:

హైటెక్ యుగంలో ఉన్న మనం చదువుకునే తాతల నాటి రోజులు గుర్తుకోస్తున్నాయి. కూటి కోసం కోటి విద్యలు అనే సామెత మరచి చదువుకోసం కోటి కష్టాలు పడవలసిన పరిస్థితి విద్యార్థులకు

దాపురించింది. కిలోమీటర్ల పోడవున పుస్తకాలను మోస్తూ పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల చదువులు గుదిబండగా మారాయి. సర్కార్ బడుల్లో విద్యార్థులు తప్పనిసరిగా చదివించాలని అధికారులు

చేబుతున్న చిత్తశుద్ధి విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు.మండలంలో మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులు రావడం లేదు. దీంతో గ్రామీణ విద్యార్థులు

నిత్యం 3 నుంచి 5 కిలోమీటర్‌ల వరకు పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. మండలంలో బర్ధీపూర్ నుండి ముస్లాపూర్ పాఠశాలకు వెంకటపూర్, ఎల్లంపల్లి,చల్లపల్లి నుండి ండి వేల్పుగొండ,

కమ్మరికత్త, సురంపల్లి, బోడగట్టు గ్రామలనుండి ఎల్లుపెట వరకు పల్వంచ, కోరంపల్లి నుండి దన్నురకు దాదయిపల్లి గడిపెద్దపూర్‌కు నిత్యం విద్యార్థులు నాలుగు కిలోమిటర్ల మేరకాలినడకన

పాఠశాలలకు వచ్చి చదువుకుంటున్నారు.ఇలా కాలినడకన బండెడు పుస్తకాలు మోసుకుంటు వస్తుండడంతో విద్యార్థులు త్వరగా అలసిపోవడంతో చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నారని విద్యార్థుల

తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా సమయం కుండా వృదా అవుతుందని అంటున్నారు. ఇలా వెళ్లాలేని విద్యార్థులు చదువుకు స్వస్తిచేప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుందని

విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల చదువుల కోసం గొప్పలు చేబుతున్న అధికారలు రవాణా సౌకర్యం కల్పించడంతో ఎందుకు విఫలమవుతున్నరని విద్యార్థుల

తల్లిదండ్రులు ప్రశ్నిస్తిన్నారు. ఇప్పటికైనా రవాణా సౌకర్యం లేని గ్రామాల్లో విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పింంచేలా చూడాలని విద్యార్ళుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

శివార్లలో డబుల్ రిజిస్ట్రేషన్లు

Tags: To study, you have to walk 3 kilometers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *