వరుడికి తాళి

  Date:13/03/2019

బెంగళూర్ ముచ్చట్లు:
వధువుకు వరుడు తాళి కట్టడం రొటీన్. వరుడికి వధువు తాళి కట్టడం వెరైటీ. మరి, వధువరులిద్దరూ ఒకరి మెడలో ఒకరు తాళి కట్టుకుంటే.. అది వైరల్! ఔను, ఈ సరికొత్త ట్రెండ్ ఇప్పుడు కర్ణాటకలోని కులాంతర వివాహాల్లో మొదలైంది. లింగ సమానత్వానికి ప్రతీకగా భావిస్తూ 12వ శతాబ్దంలో బసవన్న అనే సామాజికవేత్త ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.  నలతవాద్‌ గ్రామంలోని హల్లూరులో దుబ్బాగి, బ్రగుండి కుటుంబాలు కులాంతర వివాహాల్లో ఈ సాంప్రదాయాన్ని అమలు చేశారు. హాలుముట్ వర్గానికి చెందిన పెళ్లి కొడుకులు అమిత్, ప్రభురాజ్, బనజిగా వర్గానికి చెందిన పెళ్లి కూతురులు ప్రియ, అంకితలకు పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ పెళ్లిలో వధువు మెడలో వరుడు మంగళసూత్రం కట్టిన తర్వాత వధువు కూడా వరుడి మెడలో మంగల సూత్రం కట్టే సంప్రదాయాన్ని పాటించారు. ఈ పెళ్లికి ప్రత్యేకంగా ముహూర్తం పెట్టకపోవడం గమనార్హం. అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేసే సాంప్రదాయాన్ని కూడా పాటించకపోవడం విశేషం. మదరాసా చెన్నయ్య గురు పీఠానికి చెందిన బసవ మూర్తి ఈ పెళ్లికి పెద్దగా వ్యవహరించారు. కులమత బేధాలే కాదు, స్త్రీ పురుషుల మధ్య కూడా ఎటువంటి తారతమ్యం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ విధానంలో పెళ్లిల్లు జరుపుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
Tags;To the groom

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *