జబర్దస్త్ లోకి వర్షిణీ

To turn into Zabardath

To turn into Zabardath

Date:27/11/2018
గ్లామర్ ఫీల్డ్‌లో విపరీతమైన పోటీ ఉంటుంది. ఇందులో వెండి తెర, బుల్లి తెర అని లేదు. అందం, అభినయంతో ఆకట్టుకున్న వాళ్లకే ప్రేక్షకుల మద్దతు. అలా అప్పట్లో బుల్లితెరను యాంకర్ ఉదయభాను ఓ ఊపి ఊపితే… ఈ తరువాత వచ్చిన అనసూయ, రష్మిలు ‘జబర్దస్త్’ కామెడీ షోతో హాట్ యాంకర్స్ అన్న పేరును హైజాక్ చేసేశారు. బుల్లి తెరకు గ్లామర్ సొగసులు అద్ది.. యాంకర్ అనే పదానికి హాట్ టచ్ ఇచ్చారు. ముఖ్యంగా యాంకర్ అనసూయ గత ఐదేళ్లుగా ‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెరపై తిరుగులేని టాప్ యాంకర్ బిజీ అయ్యింది. స్కిట్స్ మాత్రమే కాకుండా ఈ షోకి అనసూయ హాట్ నెస్‌ కూడా కలిసివచ్చింది. దీంతో ఒక వైపు జబర్దస్త్ చేస్తూనే వరుస సినిమాలతో బిజీగా మారింది అనసూయ. సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో నాగార్జున మరదలు పాత్రలో మెప్పించిన అనసూయ.. ‘క్షణం’లో ఏసీపీ జయగా పవర్‌ఫుల్‌గా కనిపించింది. ఇక‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకుని.. వరుస ఆఫర్స్‌ని అందుకుంది. వెంకటేష్.. వరుణ్ తేజ్ ‘ఎఫ్ 2’, ‘యాత్ర’, ‘కథనం’ తదితర చిత్రాలతో పాటు ‘రంగస్థలం’ అనే డాన్స్ షో బిజీగా మారింది. దీంతో ఒకవైపు సినిమాలు మరో వైపు జబర్దస్త్‌ షోని బ్యాలన్స్ చేయలేకపోతుందో ఏమో కాని.. గత ఐదేళ్లుగా ‘జబర్దస్త్’ షోకి గ్లామర్ సొగసులు అద్దుతున్న హాట్ యాంకర్ అనసూయ గత రెండు వారాలుగా కనిపించకుండా పోయింది.
అనసూయ ప్లేస్‌లో ఢీ 10 కో యాంకర్ వర్షిణి బుల్లితెరపై సందడి చేస్తుంది. దీంతో అనసూయ జబర్దస్త్ షో నుండి ఔట్.. వర్షణి ఇన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీనితో పాటు ఎప్పటి కప్పుడు ‘జబర్దస్త్’ అప్డేట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసే అనసూయ నుండి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో దాదాపు అనసూయ జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పేసిందనే వార్తలు ఊపందుకున్నాయి.ఇక అనసూయ ప్లేస్‌ని రీప్లేస్ చేసిన వర్షిణి ఏకులా వచ్చి మేకైంది. తనదైన శైలిలో ఆకట్టుకుంటూ దూసుకుపోతుండటంతో ప్రేక్షకుల నుండి ఊహించని స్థాయి రెస్పాన్స్ వస్తుంది. గత ఐదేళ్లుగా ఆంటీ అనసూయ చూసి బోర్ కొట్టిందని.. వర్షిణి అయితేనే బెటర్. ఆమెను పర్మినెంట్‌ చేసేయండని ‘జబర్దస్త్’ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. బుల్లితెరతో పాటు గతంలో వెండితెరపైనా మెరిసింది వర్షిణి. ‘చందమామ కథలు’, ‘బెస్ట్ యాక్టర్స్’తో పాటు పలు చిత్రాల్లో శామిలి సౌందరాజన్ పేరుతో నటించారు. ఈ తరువాత వర్షిణిగా పేరు మార్చుకుని ‘ఢీ 10’ డాన్స్ షోలో కో యాంకర్‌గా ఢీకొట్టింది. ఇక అమ్మడు హాట్ నెస్‌ గురించి చెప్పాలంటే ఆమె సోషల్ మీడియా ఖాతాలను తెరవాల్సిందే. మలేషియా ట్రిప్‌లు ఆ ట్రిప్‌లు ఈ ట్రిప్‌లు అంటూ బికినీ సొగసులతో సోషల్ మీడియా హీటెక్కించిన అనుభవం ఈ హాట్ లేడీకి ఉంది. మొత్తానికి అటు అభినయం.. ఇటు అందాల ఒలకబోత రెండూ ‘జబర్దస్త్’ యాంకర్ అనిపించుకునేట్టే కనబడుతోంది.
Tags:To turn into Zabardath

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *