నేడు రెండు రూపాల్లో దుర్గమ్మ దర్శనం
విజయవాడ ముచ్చట్లు:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై సోమవారంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. ఆదివారం దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చిన భక్తులు దర్శించుకున్నారు..

ఉత్సవాల చివరి రోజైన సోమవారం దుర్గమ్మ రెండు రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం మహిషాసురమర్దనిగా.. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. చివరి రోజు కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాలు ముగుస్తుండడంతో ఇంద్రకీలాద్రికి భవానీ భక్తుల రాక పెరిగింది. దసరా ముగిసిన తర్వాత కూడా రెండు రోజుల పాటు భవానీలు తరలిరానున్నారు.
Tags: Today Durgamma is seen in two forms
