విద్యాశాఖలో నాడు- నేడు పై ముగిసిన సీఎం వైఎస్ జగన్ సమీక్ష

-ఆదిమూలపు సురేష్ ,విద్యాశాఖ మంత్రి

 

అమరావతి ముచ్చట్లు:

 

ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. ఈనెల 12 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయం. ఆగస్టులోపు విద్యా సంస్థల్లో నాడు నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. జూల్ 15-ఆగస్టు 15వరకు వర్క్ బుక్కులపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం. పాఠశాలలు పునః ప్రారంభం కానున్న ఆగస్టు15లోపు పాఠశాల పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో నాణ్య మైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నూతన విద్యా విధానం తప్పనిసరిగా అమలు చేస్తుంది. నూతన విద్యా విధానం అమలు వల్ల ఏ స్కూల్ మూతపడదు, ఏ ఉపాద్యాయుడు పోస్టు తగ్గదు.రాబోయే రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులు నిర్మాణం పూర్తి. నాడు నేడు కింద పనుల కోసం 16 వేల కోట్లతో బడ్జెట్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. 30శాతం పదోతరగతి , 70 శాతం ఇంటర్ ప్రధమ సంవత్సరం మార్కులు ప్రాతిపదికగా ఇంటర్ విద్యార్థులకు మార్కుల కేటాయిస్తాం. ఈనెలాఖరు లోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తాం.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Today in the Department of Education- Review of CM YS Jagan which ended today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *