నేడు బల్కంపేట అమ్మవారి కళ్యాణ మహోత్సవం

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ జిల్లాలోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మ వారి కల్యాణం మంగళ వారం జరుగనుంది. సోమ వారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు మూడు రోజు ల పాటు జరుగుతాయి.సోమవారం ఉదయం గణపతి పూజతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమ య్యాయి. సాయంత్రం అమ్మవారికి ఎదుర్కోళ్లు శాస్ర్తోక్తంగా నిర్వహించారు.వేడుకల్లో ప్రధాన ఘట్టమైన ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్‌ లగ్న సుముహూర్తమున వైభవం గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దేవాలయ ఈవో కె.అంజనీ దేవి తెలిపారు.లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు మహాశాంతి చండీ హోమం, సాయంత్రం ఆరు గంటలకు ఎల్లమ్మ అమ్మవారిని రథంపై పురవీధుల్లో ఊరేగిస్తారు.

 

 

Tags:Today is Balkampeta Ammavari Kalyan Mahotsav

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *