Natyam ad

నేడు సి.పి.బ్రౌన్‌ 224వ జయంత్యుత్సవం

కడప ముచ్చట్లు:

తెలుగు సూర్యుడు’ సి.పి.బ్రౌన్‌ 224 జయంత్యుత్సవాన్ని గురువారం ఉదయం 10.30 గంటలకు సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో నిర్వహించనున్నామని బాధ్యులు డా. మూల మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా  పుస్తకావిష్కర్తగా యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి, సభాధ్యక్షులుగా ప్రముఖ కథారచయిత, బ్రౌన్ కేంద్రం  సలహామండలి సభ్యులు షేక్‌ హుస్సేన్‌ సత్యాగ్ని, విశిష్ట అతిథిగా  కులసచివులు ఆచార్య దుర్భాక విజయ రాఘవ ప్రసాద్‌, ప్రధాన వక్తగా శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ విశ్రాంత ఆచార్యులు ఆచార్య మేడిపల్లి రవికుమార్‌, ఆత్మీయ అతిథులుగా అసిస్టెంట్‌ కమిషనర్‌ (జిఎస్టీ`ప్రొద్దుటూరు`1 సర్కిల్‌) మోరంరెడ్డి వేణుగోపాల్‌ రెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్రోపన్యాసకులు (రాజంపేట) డా ఐ.ఎల్‌.ఎన్‌.చంద్రశేఖర రావు, గౌరవ అతిథులుగా మొల్ల సాహితీ పీఠం అధ్యక్షులు విద్వాన్‌ గానుగపెంట హనుమంతరావు (బద్వేలు), పుట్టపర్తి సాహిత్య పీఠం కార్యదర్శి జింకా సుబ్రహ్మణ్యం (ప్రొద్దుటూరు) పాల్గొంటారు. కార్యక్రమంలో భాగంగా ‘వైయస్సార్‌ కడప జిల్లా చరిత్ర’ పుస్తకం ఆవిష్కరింప బడుతుంది. కార్యక్రమాన్ని కేంద్రం బాధ్యులు డా.మూల మల్లికార్జున రెడ్డి నిర్వహిస్తారని తెలిపారు.

 

Tags: Today is CP Brown’s 224th birth anniversary

Post Midle
Post Midle