ఈ రోజు చీకటి దినం. పెద్దనోట్ల రద్దు ఉపద్రవం: మమతా బెనర్జీ

Today is the dark day. Mamata Banerjee is a major scam

Today is the dark day. Mamata Banerjee is a major scam

Date:08/11/2018
లక్నో  ముచ్చట్లు:
పెద్ద నోట్ల రద్దు జరిగి నేటికి రెండేళ్లు పూర్తయ్యింది. ఒక ఉపద్రవమని పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. నోట్లరద్దు పై మొదటి నుంచి ప్రతికూల అభిప్రాయంతో ఉన్న ఆమె ఈ రోజు మరో అడుగు ముందుకేసి గురువారం ట్వీట్ల దాడి చేశారు.‘ ఈరోజు చీకటి దినం. పెద్దనోట్ల రద్దు ఉపద్రవంగా మారింది. నేను దీనికి వ్యతిరేకంగా అప్పటి నుంచే పోరాడుతున్నాను. దీనిపై సామాన్య ప్రజలు, ఆర్థిక వేత్తల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమయింది. ఇది విఫలమైందని‌ ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ఓ భారీ కుంభకోణం‌. దీన్ని అడ్డం పెట్టుకుని భాజపా దేశాన్నే మోసం చేసింది. వారు చేసిన పనికి ఇప్పుడు ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు.’ అని ట్వీట్‌ చేశారు.పెద్ద నోట్లు రద్దయి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ కూడా ట్విటర్‌లో స్పందించారు. ‘ఈ రోజు నవంబర్‌ 8. రెండేళ్ల క్రితం భారత ప్రజలకు తగలిన దెబ్బ ఇంకా మానలేదు. వారి బాధ ఇంకా తీరలేదు. ఈ రోజు దాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. నోట్ల రద్దు కర్కశమైన నిర్ణయం’ అని ట్వీట్‌ చేశారు.
Tags: Today is the dark day. Mamata Banerjee is a major scam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *