– కమిషనర్ కెఎల్.వర్మ
Date:23/11/2020
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వాదేశాల మేరకు నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహార్ధశ పట్టిందని కమిషనర్ కెఎల్.వర్మ అన్నారు. సోమవారం ఆయన పట్టణంలోని కొత్తయిండ్లు హైస్కూల్ తదితర పాఠశాలల్లో నాడు-నేడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, కమిటి సభ్యులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన జగనన్న విద్యా కానుక క్రింద విద్యార్థులకు అందించిన యూనిఫాంలు, బెల్టులు, షూలు, బ్యాగులు వగైరాలను పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాదేశాలతో కార్పోరేట్‌కు ధీటుగా ప్రైవేటు పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించడం జరిగిందన్నారు.ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు ఎన్నడు లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు క్యూ కట్టడం అభినందనీయమన్నారు. ప్రైవేటు పాఠశాలలు విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం శుభపరిణామమన్నారు. నాణ్యమైన విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తుందని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు సహకరించాలని కోరారు.
Tags; Today is the day for schools