నేడే నిత్య జనగణమన వందరోజుల వేడుకలు

Today is the day of the Nithya massacre

Today is the day of the Nithya massacre

Date:22/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పుంగనూరు పట్టణంలో జనగణమన నిత్యగీతాలాపనను ఆగస్టు 15న ప్రారంభించి, శుక్రవారంతో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌ .వర్మ, తహశీల్ధార్‌ మాదవరాజు, సీఐ నాగశేఖర్‌, ఎక్సెజ్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి , ట్రాన్స్కో ఏడి వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వందరోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు జనగణమనకమిటి సభ్యులు పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, పి.అయూబ్‌ఖాన్‌, వి.దీపక్‌, ఎన్‌.ముత్యాలు, సివి.శ్యామ్‌ప్రసాద్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరాసర్కిల్‌లో గల తెలుగుతల్లి విగ్రహానికి , పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి, కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పట్టణ జాతీయ రహదరిపై గల గోకుల్‌సర్కిల్‌, బస్టాండు, ఇందిరాసర్కిల్‌, కెకె సర్కిల్‌, తూర్పువెహోగశాల ప్రాంతాలలో ఉదయం 8 గంటలకు జాతీయ గీతాలాపన జరగనున్నది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు జాతీయ జెండాను తీసుకుని, ఎగురవేస్తూ, జాతీయగీతాలాపన చేసేందుకు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.

 

కార్తీక దీపోత్సవానికి పుష్కరిణి సిద్దం

Tags: Today is the day of the Nithya massacre

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *