ఇవ్వాళ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం

By TM-Team Jul6,2024

-ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

 

గాంధీ భవన్ ముచ్చట్లు:

 

ఇవ్వాళ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం జరగబోతుంది.ఇది శుభసూచకంగా ప్రజలు భావిస్తున్నారు.రాష్ట్రాలు విడిపోయిన అన్నదమ్ముల వలె విభజన హామీల పరిష్కారం కానీ అంశాలు పరిష్కారం కోసం చర్చ జరుగుతుంది.సీఎం రేవంత్ రెడ్డి కి తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ అర్ధం అవుతుంది.ప్రజల ఆకాంక్షల మేరకు ఇరు రాష్ట్రాల సీఎం లు మాట్లాడుతుంటే.దీనిని రాజకీయంగా ఉపయోగించుకొని బురద జల్లాలని బీ ఆర్ ఎస్ చూస్తున్నారు.కేసిఆర్,ఆయన పరివారానికి మనసున పట్టడం లేదు.తమ లాగా ప్రజలను మాగ్యపెట్టాలి అన్నట్లు చూస్తున్నారు.కేసిఆర్,జగన్ లు పదేళ్లు స్వార్థ రాజకీయాల తప్ప సమస్యల పరిష్కారం కోసం చర్చ చేయలేదు.రోజా ఇంట్లో చేపల పులుసు తిని రాయల సీమను రతనాల సీమ చేస్తా అని కేసిఆర్ అన్నాడు.సీఎం గా కేసిఆర్ ఉన్నప్పుడే 7 మండలాలు ఆంధ్రలో కలిపారు కదా..హంతకులే సంతాపం తెలిపినట్లు చేస్తున్నారు.పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పని చేస్తుంది.ఆంధ్ర నుంచి రావాల్సిన వాటా వదిలిపెట్టి ఇక్కడి సంపద అక్కడికి తరలించారు.ఇప్పటికైనా కేసిఆర్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తే బాగుంటుంది.ఇరు రాష్ట్రాల సీఎం లా భేటీ నీ వివాదం చేయాలని చూస్తున్నారు.తెలంగాణ లో ఆర్థిక, భూ దోపిడీ చేసిన BRS ప్రజల సమస్యలు ఎప్పుడు ఆలోచన చేయలేదు.కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ ను.. కేసిఆర్ కుక్కలు చింపిన విస్తరి చేశాడు.కేసిఆర్ పార్టీ దినదిన గండం అన్నట్లు సాగుతుంది.కేసిఆర్ చేసిన పాపాలు కూడా రేవంత్ రెడ్డి కడగల్సిన పరిస్తితి వచ్చింది.కేసిఆర్,జగన్ లు ఎప్పుడు చీకటి భేటీలు అయ్యేవారు.కేసిఆర్ కుటుంబం ప్రతి దానిలో రాజకీయ ప్రయోజనాలు చూస్తున్నారు.రేవంత్ రెడ్డి ప్రజల ప్రయోజనాలు చేస్తున్నారు.తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి కి తెలంగాణ ప్రజల తరుపున ధన్యవాదాలు.

 

Tags: Today is the meeting of the CMs of the united Telugu states

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *